భీం ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ పై కాల్పుల ఘటనపై ఉన్నతస్థాయి న్యాయవిచారణ జరపాలి

– బహుజన లెఫ్ట్ ఫ్రంట్-బిఎల్ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ దండి వెంకట్
నవతెలంగాణ – కంటేశ్వర్
భీం ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ పై ఉత్తర ప్రదేశ్ లోని సహారాన్ పూర్ లో ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన పై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపిన దుండగులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్ లో బిఎల్ఎఫ్, భీం ఆర్మీల ఆధ్యర్యంలో నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా బిఎల్ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ దండి వెంకట్, భీం ఆర్మీ జిల్లా అద్యక్షులు సంజీవ్ ససనేలు మాట్లాడుతూ.. ఉత్తర ప్రదేశ్ బిజెపి ప్రభుత్వ అండాలు తోనే భీం ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ పై అగ్రకుల ముష్కర మూకలు దొంగచాటుగా కాల్పులు జరిపారని, దోషులను గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బిసి మైనారిటీలైన బహుజన ప్రజలపై జరుగుతున్న హత్యలు, అత్యాచారాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న భీం ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ పై యోగి ప్రభుత్వం ఇప్పటికే చాలాసార్లు అక్రమ కేసుల్లో ఇరికించిందని వారు ఆరోపించారు. బిజెపి అనుసరిస్తున్న ఆధిపత్య కులాల దోపిడి విధానాలనకు వ్యతిరేకంగా ఉద్యమించే శక్తులను అణిచివేసే ఫాసిస్టు చర్యలకు పాల్పడుందని విమర్శించారు.ఈ కార్యక్రమంలో బహుజన మహిళా సంఘం రాష్ట్ర కన్వీనర్ సబ్బని లత, జిల్లా అద్యక్ష కార్యదర్శులు గీతాంజలి, దండు జ్యోతి, జిల్లా నాయకురాలు కవిత, బిఎల్ పి జిల్లా కన్వీనర్ కాంబ్లీ మధు, ఎంసిపిఐయు జిల్లా కార్యదర్శి కె. శ్రీనివాస్, బిఎల్ఎఫ్ జిల్లా నాయకులు మైత్రి రాజశేఖర్, బౌద్ధ సొసైటీ రాష్ట్ర నాయకులు అశోక్ భాగ్య వన్, భీం ఆర్మీ నాయకులు రాహుల్, అజయ్, బిఎల్ టియు జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love