ఎస్ డి నగర్ కమిటీ హాల్ కు భూమి పూజ..

నవతెలంగాణ – సుల్తాన్ బజార్
జాంబాగ్ డివిజన్ లోనీ ఎస్ డి నగర్ కమిటీ హాల్ కు గోషామహల్ నియోజకవర్గం ఎమ్మెల్యే రాజాసింగ్ స్థానిక కార్పొరేటర్ రాకేష్ వాళ్ళతో కలిసి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బస్తీ వాసులు రామకృష్ణ (కట్టప్ప)తో కలిసి తమకు ఎన్నోసార్లు వినతి పత్రాలు అందించారని వారు చెప్పారు. బస్తీ వాసుల విన్నపాళ్లను తీసుకొని కమిటీ హాల్ నిర్మించేందుకు భూమి పూజ చేసినట్లు తెలిపారు. వెంటనే అధికారులు కమిటీ హాల్ నిర్మాణానికి కావలసిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో బస్తీ అధ్యక్షులు బి నరసింహ గౌడ్, ఉపాధ్యక్షులు బొట్టు సురేష్, ప్రధాన కార్యదర్శి రామకృష్ణ, కార్యదర్శి టి జనార్ధన్, ట్రెజరర్ ఎం బాలకృష్ణ గౌడ్, అడ్వైజర్లు బస్తీ పెద్దలు, యువత తదితరులు పాల్గొన్నారు.