పెద్ద షాపూర్‌ తండా ప్రభుత్వ

– ఎంపీటీసీ చెక్కల ఎల్లయ్య ముదిరాజ్‌
– అక్రమార్కుల చెర నుంచి
– ప్రభుత్వ భూములు స్వాధీనం చేసుకోవాలని డిమాండ్‌
– మంత్రి సబితారెడ్డి చొరవతో అక్రమ నిర్మాణాలు నిలిపివేత
నవతెలంగాణ-శంషాబాద్‌
పెద్దషాపూర్‌ తండా ప్రభుత్వ భూముల రక్షణ లో పేదలకు ఒక న్యాయం పెద్దలకు ఒక న్యాయం జరుగుతున్నదని శంషాబాద్‌ మాజీ ఎంపీపీ, పెద్ద షాపూర్‌ ఎంపీటీసీ చెక్కల ఎల్లయ్య ముదిరాజ్‌ ఆం దోళన వ్యక్తం చేశారు. పీఓటీ కింద స్వాధీనం చేసు కున్న భూములు రక్షించడంలో అధికారులు పూర్తిగా అక్రమార్కులకు కొమ్ముగాస్తున్నారని ఆరోపించారు. బుధవారం ఆయన శంషాబాద్‌లో స్థానిక మాజీ సర్పంచ్‌ ఎస్‌.ఈస్రనాయక్‌ మాజీ ఎంపీటీసీ గోపాల్‌ నాయక్‌తో కలిసి మండల ప్రజా పరిషత్‌ కార్యాల యంలో తహసీల్దార్‌ కార్యాలయంలో సమస్య గురిం చి మాట్లాడడానికి పెద్ద షాపు తండా వాసులతో కలిసి సర్వే నెంబర్‌ 220 పీఓటీ భూముల్లో అక్ర మాలను అడ్డుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ సం దర్భంగా పెద్ద షాపూర్‌ తండా గ్రామంలోని సర్వేనెం బర్‌ 220లో జరుగుతున్న అక్రమాల గురించి మీడి యాకు వివరించారు. పెద్ద షాపుర్‌ తండా గ్రామ రెవెన్యూ సర్వే నెంబర్‌ 220లో 105 ఎకరాల ప్రభు త్వ భూమి ఉన్నది. ఇందులో నలుగురు స్వాతంత్ర సమరయోధులకు 10 ఎకరాల చొప్పున 40 ఎకరా ల భూమి ప్రభుత్వం కేటాయించింది. మిగతా 65 ఎకరాల భూమిలో స్థానిక ఎస్టి, ఎస్సీ బడుగు బల హీన వర్గాలకు భూమిని అసైన్డ్‌ చేశారు. 10 ఏండ్ల తర్వాత అసైన్డ్‌ చేసిన భూములను కొంతమంది రైతులు ప్రయివేటు వ్యక్తులకు అమ్ముకున్నారు. విష యం రెవెన్యూ అధికారులకు తెలియడంతో అప్పటి జాయింట్‌ కలెక్టర్‌ రజ్వీ, స్థానిక ఎమ్మార్వో జే మధు అసైన్డ్‌ భూమిని కొనుగోలు చేసిన వ్యక్తుల నుంచి స్వాధీనం చేసుకుని పిఓటి కింద మార్చారు. సుమా రు 25 ఎకరాల భూమి పిఓటీ కిందకు వచ్చింది. ఇందులో 2006 సంవత్సరంలో 12 ఎకరాల భూ మిని అప్పటి ప్రభుత్వం ఇందిరమ్మ స్థలాల కోసం తీసుకుంది. ఈ భూమిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనా ర్టీ పేద బడుగు, బలహీన వర్గాలకు 60 గజాల చొప్పున 600 కుటుంబాలకు ఇళ్ల స్థలాలు కేటాయిం చింది. ఇందులో 450 మందికి ఇండ్ల స్థలాలు కేటా యిస్తూ అప్పటి ఎమ్మార్వో సర్టిఫికెట్లు ఇచ్చారు. మ రో 250 మంది లబ్ధిదారులకు సర్పంచ్‌ పంచాయతీ కార్యాలయం నుంచి రూ.180 రిసిప్ట్‌ తీసుకొని వారి కి 60 గజాలు చొప్పున స్థలాన్ని కేటాయిం చారు. అయితే 15 ఏళ్ల క్రితం కోర్టు ఆర్డర్‌ తీసుకొచ్చిన కొం దరు వ్యక్తులు ఇటీవల కాలంలో ఇందిరమ్మ ఇళ్లస్థ లాలకు కేటాయించిన 12 ఎకరాల భూమిలో ఆరు ఎకరాల భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నిస్తు న్నారు. ఇక్కడ ఇండ్ల స్థలాలు కేటాయించిన కొం దరికి ఇల్లు కట్టుకోవడానికి ఎలాంటి అనుమ తులు ఇవ్వకుండా పిఓటి ల్యాండ్‌ అంటూ అధికారులు బెది రింపులకు దిగుతున్నారు. ఇల్లు కట్టుకోవడానికి ఎలాంటి అనుమతులూ ఇవ్వకుండా ఇబ్బందుల గు రి చేస్తున్నారు. 15 ఏండ్ల క్రితం కోర్టు ఆర్డర్‌ ఉందం టూ ఎలాంటి సర్వే లేకుండా పోజిషన్‌ తెలవకుండా కొంతరు ప్రభుత్వ భూమిలో కబ్జాకు పాల్పడుతు న్నారు. వీరికి ఆర్డర్‌ కాఫీ ఉందంటూ వారి వైపున అధికారులు మాట్లాడుతున్నారు. కాలం చెల్లిన కోర్టు ఆర్డర్‌ పట్టుకొని ఇప్పుడు కబ్జాకు వస్తే అధికారులు ఎందుకు మౌనంగా ఉంటున్నారని స్థానికులు ప్రశ్ని స్తున్నారు. స్థానికులు వెళ్లి అక్రమ నిర్మాణాలను అడ్డు కుంటే పోలీసులను ఉసిగొలిపి కేసులు పెడతా మని బెదిరిస్తున్నారు. మిగతా 8 ఎకరాల పిఓటీ భూమిలో కొందరు వ్యక్తులు అక్రమంగా దౌర్జన్యంగా 2.30 ఎకరాలకు ప్రీకాస్ట్‌ పలకలతో ప్రహరీ గోడలు నిర్మించారు. కొందరు ఇందిరమ్మ ఇండ్ల స్థలాలకు కేటాయించిన 12 ఎకరాల భూమిలో 6 ఎకరాల భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారు. దీన్ని గ్రామస్తులు అడ్డుకొని రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ ఆర్డిఓ సిసిఎల్‌ఏ స్థానిక తహసిల్దార్‌కు ఫిర్యాదు చేశారు.
స్పందించిన విద్యాశాఖ మంత్రి
గిరిజనులు, దళితులు, బీసీలు, మైనార్టీ లకు బడుగు బలహీన వర్గాలకు కేటాయించిన ఇందిరమ్మ ఇండ్ల స్థలాల భూమి పిఓటి భూములను కొంత మంది కబ్జాకు పాల్పడుతుంటే అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా రెడ్డికి స్థానికులు ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన ఆమె అక్రమ నిర్మాణ ాలను వెం టనే అడ్డుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో స్థానిక అధికారులు అక్కడ పనులను నిలిపివేశారు.
మాజీ ఎంపీపీ చెక్కల ఎల్లయ్య మాట్లాడుతూ
పెద్దషాపూర్‌ తండా పీఓటీ భూమిలో నకిలీ దృవపత్రాలు సృష్టించి భూమిని కాజేయడానికి కొం దరు పెద్ద ఎత్తున కుట్రలు పన్నుతున్నారని ఆరోపిం చారు. అక్రమార్కుల చెర నుంచి ప్రభుత్వ భూమిని కాపాడాలని డిమాండ్‌ చేశారు. దీంతో పాటు స్థాని కులకు కేటాయించిన ఇందిరమ్మ స్థలాలలో ఇండ్లు నిర్మించుకోవడానికి అనుమతులు ఇవ్వాలన్నారు. లే ని తరుణంలో పేదల పక్షాన ఎంతటి పోరాటానికై నా సిద్ధమన్నారు. కార్యక్రమంలో ఎస్‌.రవి నాయక్‌, ఎస్‌.లక్ష్మణ్‌, పి.మల్లేష్‌, ఎస్‌. శంకర్‌, ఎస్‌. దేవేం దర్‌, తులిసిరాం, ఆర్‌.రమేష్‌ తదితరులున్నారు.భూములును రక్షించాలి

Spread the love