27న బిగ్‌ సర్‌ప్రైజ్‌

చిరంజీవి నటిస్తున్న తాజా మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘భోళా శంకర్‌’. మెహర్‌ రమేష్‌ దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర భారీ కాన్వాస్‌లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆదివారం మేకర్స్‌ మరో బిగ్‌ అప్డేట్‌ ఇచ్చి అటు ప్రేక్షకులను, ఇటు చిరు అభిమానులను సర్‌ప్రైజ్‌ చేశారు. ఈ చిత్ర థియేట్రికల్‌ ట్రైలర్‌ను ఈనెల 27న విడుదల చేస్తున్నారు.
‘ట్రైలర్‌తో మరో 4 రోజుల్లో మెగా పండగ ప్రారంభం కానుంది. ఇప్పటికే టీజర్‌, పాటలతో మేకర్స్‌ కావాల్సి నంత వినోదాన్ని అందించారు. ట్రైలర్‌ రిలీజ్‌ అనౌన్స్‌మెంట్‌ సందర్భంగా రిలీజ్‌ చేసిన పోస్టర్‌లో చిరంజీవి కత్తి పట్టుకుని ఫెరోషియస్‌గా కనిపిస్తున్నారు. ఈ పోస్టర్‌ సైతం మెగా అభిమానులను ఫుల్‌ ఖుషీ చేసింది’ అని చిత్ర బృందం పేర్కొంది.
తమన్నా భాటియా, కీర్తి సురేష్‌, సుశాంత్‌ ముఖ్య తారాగణంగా నటిస్తున్న ఈ చిత్రానికి మహతి స్వర సాగర్‌ సంగీతం అందిస్తున్నారు. అనిల్‌ సుంకర ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఆగస్టు 11న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్‌ సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి డీవోపీ: డడ్లీ, ఎడిటర్‌: మార్తాండ్‌ కె వెంకటేష్‌, ప్రొడక్షన్‌ డిజైనర్‌: ఏఎస్‌ ప్రకాష్‌, కథా పర్యవేక్షణ: సత్యానంద్‌, డైలాగ్స్‌: తిరుపతి మామిడాల.

Spread the love