పోలవరం ప్రాజెక్టు వద్ద పెద్దపులి సంచారం…

నవతెలంగాణ – అమరావతి
పోలవరం ప్రాజెక్టు వద్ద పెద్ద పులి హడలెత్తిస్తోంది. పులి సంచారంతో ప్రాజెక్టు అధికారులు, కార్మికులు, స్థానికులు భయంతో వణికిపోతున్నారు. ఏ క్షణంలో ఎటువైపు నుంచి పులి వస్తుందోనని భయాందోళనకు గురవుతున్నారు. పులి సంచరిస్తున్న విషయాన్ని అటవీశాఖ అధికారులు కూడా ధ్రువీకరించారు. పోలవరం ప్రాజెక్టు పనులు జరుగుతున్న ప్రాంతంలో పులి తిరుగుతున్నట్టు ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. మరోవైపు రాత్రి వేళల్లో ప్రాజెక్టు ప్రాంతంలో పులి సంచరిస్తున్న దృశ్యాలను అక్కడున్న సిబ్బంది తమ ఫోన్లలో చిత్రీకరించారు.

Spread the love