సీఐటీయూ డిమాండ్
నవతెలంగాణ-ములుగు
రెజిలింగ్‌లో అంతర్జాతయ స్థాయిలో అనేక కీర్తి పతకాలు సాధించిన భారత మహిళా రెజ్లర్ల పై లైంగిక వేధిం పులకు పాల్పడిన బీజేపీ ఎంపీ, రెజ్లర్‌ల సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని ఢిల్లీలో గత నెల రోజులుగా ఆందోళన చేస్తున్న మల్ల యోధులకు మద్దతుగా సీఐటీయూ ఆధ్వర్యంలో సంఘీభావంగా కలెక్టర్ కార్యా లయం ముందు శనివారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి రత్నం రాజేందర్ మాట్లాడుతూ గత కొన్ని నెలలుగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మహిళా రెజ్లర్లుపై లైంగిక వేధింపులకు పాల్పడిన బ్రేజ్ భూషణ్‌ను అరెస్టు చేయాలని, పోరాడుతున్న వారిపై ప్రభుత్వం కక్ష సాధింపు లకు పాల్పడడం మానుకోవాలని హితవు పలికారు.బిజెపి ఎంపీ అభినవకీచకు డు అయినా బ్రేజ్ భూషణ్ మహిళా రెజ్లర్లపైన అనేక సార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డారని, తిరగబడిన రెజ్లర్లపై కక్ష సాధింపు చర్యలకు, అనైతిక చర్యలకు పా ల్పడుతున్నాడని ఆయనను ప్రభుత్వం ఎంపీ పదవి నుండి సస్పెండ్ చేయాలని, రెజ్లర్ల సమాఖ్య అధ్యక్షుడి పదవి నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. మహి ళా రెజ్లర్లు కొన్ని నెలలుగా పోరాటం చేస్తుంటే బిజెపి ప్రభుత్వం, ప్రధాన మంత్రి ఏమాత్రం స్పందించకపోవడం మహిళలపై ప్రధాని ఉన్న అభిప్రాయాలు బయ టపడ్డాయ అన్నారు. భేటీ బచావో బేటి పడావో నినాదం ఇచ్చిన మోడీ మహిళా రెజ్లర్ల గురించి వారికి న్యాయం చేయాలనే ఆలోచన రావడంలేదా..?అని ప్రశ్నిం చారు. తక్షణమే బ్రెజ్ భూషణ్ అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని, రెజ్లర్లకు న్యా యం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్‌ఐ నాయకులు కలువల రవీం దర్, సీఐటీయూ నాయకులు చిట్టీనేని శ్రీనివాస్, కాట నర్సింగరావు, సత్యనారా యణ, నమని శంకర్, కృష్ణ, ఎట్టి నరేష్, రమేష్, పల్నాటి కృష్ణ పాల్గొన్నారు.