ఉధృతంగా ప్రవహిస్తున్న బోగత జలపాతం

Bogatha-waterfallనవతెలంగాణ-ములుగు: తెలంగాణ నయాగరా బొగత జలపాతం ఉధృతంగా ప్రవహిస్తున్నది. రెండు రోజులుగా ఎగువన కురుస్తున్న వానలతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. దీంతో ములుగు వాజేడు మండలం చీకుపల్లిలో ఉన్న బొగత జలపాతానికి వరద పోటెత్తింది. జలపాతానికి భారీగా నీరు వస్తుండటంతో జలసవ్వడులను చూడటానికి పర్యాటకులు క్యూకడుతున్నారు. ప్రకృతి సోయగాలను తిలకించి మైమరచిపోతున్నారు.