ఘనంగా గ్రామ దేవతల బోనాల పండుగ

– ప్రజలకు సుఖ సంతోషాలతో జీవించాలని పంటలు సమృద్ధిగా పండాలని మొక్కిన జనాలు
నవతెలంగాణ- మద్నూర్
మండల కేంద్ర మద్నూర్ మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో మంగళవారం నాడు గ్రామ దేవతలకు బేడల వారీగా ఘనంగా బోనాల నైవేద్యాలు సమర్పించారు. ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం జరుపుకునే ఊర దేవతల బోనాల పండుగను గ్రామ ప్రజలు సంతోషంగా ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా గ్రామ దేవతలకు నైవేద్యాలు సమర్పించి గ్రామ ప్రజలందరికీ సుఖ సంతోషాలతో జీవించే విధంగా అదేవిధంగా పంటలు సమృద్ధిగా పండే విధంగా చల్లగా చూడాలని కోరుకున్నారు. గ్రామ దేవతల బోనాల పండుగ మద్నూర్ గ్రామంలో ఘనంగా జరుపుకున్నారు.

Spread the love