బోనాలు తెలంగాణ సాంస్కృతికి చిహ్నం..

బిఆర్ఎస్ సీనియర్ నాయకులు ఆర్ వి మహేందర్ కుమార్
బిఆర్ఎస్ సీనియర్ నాయకులు ఆర్ వి మహేందర్ కుమార్
– గోషామహల్ నియోజకవర్గం బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఆర్ వి మహేందర్ కుమార్
నవతెలంగాణ -సుల్తాన్ బజార్ 
తెలంగాణ సంసృతి సంప్రదాయాలకు అద్దంపట్టే బోనాల పండుగను ప్రజలు వైభవంగా జరుపుకుంటారని గోషామహల్ నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఆర్.వి మహేందర్  కుమార్ అన్నారు. ఆదివారం హనుమాన్ టెకిడిలో నిర్వహించిన బోనాల ఉత్సవాల్లో పాల్గొని మాట్లాడుతూ.. బోనాల పండుగలు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గుడికి ఆర్థిక సాయం అందిస్తున్న ఘనత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాని దేనాని అన్నారు. ప్రభుత్వం ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలను అందిస్తుందన్నారు. సీఎం కేసీఆర్ వికలాంగులకు 4016 పింఛన్ అందిస్తున్న సందర్భంగా ఆయన హర్షం వ్యక్తం చేశారు. గోషామహల్ నియోజకవర్గం నుండి రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని చెప్పారు. తనకు సీఎం కేసీఆర్. మంత్రి కేటీఆర్ ఆశీస్సులు ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు యాదగిరి, రవీంద్ర చారి, ఈశ్వర్త, ముదిరాజ్ పాల్గొన్నారు.
Spread the love