శంషాబాద్‌లో మహిళ దారుణ హత్య

నవతెలంగాణ – హైదరాబాద్‌ : శంషాబాద్‌ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ వ్యక్తి.. ఆమెను దారుణంగా హత్య చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సరూర్‌నగర్‌లో నివాసముంటున్న సాయికృష్ణ అనే వ్యక్తి అదే ప్రాంతంలో ఉంటున్న ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తేవడంతో ఆమెను సరూర్‌నగర్‌ నుంచి కారులో ఎక్కించుకొని శంషాబాద్‌కు తీసుకువచ్చాడు. స్థానిక నార్కుడ వద్ద తలపై రాయితో మోది ఆమెను హత్య చేశాడు. అనంతరం మహిళా మృతదేహాన్ని కవర్‌లో కట్టి కారులో తీసుకెళ్లి సరూర్‌నగర్‌లోని మ్యాన్ హోల్‌లో పడేశాడు. ఆ తర్వాత ఏమి ఎరగనట్లు మహిళ కనిపించడం లేదని.. ఆర్‌జీఐ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అతడిపై అనుమానంతో పోలీసులు తమదైన శైలిలో విచారణచేపట్టగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. మూడు రోజుల క్రితం ఈ హత్య జరిగినట్లు తెలుస్తోంది. సాయికృష్ణకు ఇదివరకే వివాహమై ఇద్దరు పిల్లలున్నారు.

Spread the love