విద్యుత్ షాక్ తో గేదె మృతి

నవతెలంగాణ – వీణవంక
విద్యుత్ షాక్ తో గేదె మృతి చెందిన సంఘటన మండలంలోని పోతిరెడ్డిపల్లి గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన నాగిళ్ల స్వామి కి చెందిన గేదె గ్రామంలోని ఒకటో వార్డులోని కరెంటు స్తంభానికి తాకింది. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి ఆ స్తంభం పూర్తిగా తడిసిపోయింది. విద్యుత్ షాక్ కు గురై గేదె అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనపై సర్పంచ్ పంజాల అనూష సతీష్ గౌడ్, వార్డు సభ్యులు బిక్షపతి ఘటన స్థలాన్ని పరిశీలించారు. బాధితుడిని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.