నవతెలంగాణ -చివ్వేంల: మండల పరిధిలోని ఖాసీంపేట లో బేతెస్థ మినిస్ట్రీస్ 16 వ వార్షికోత్సవం బిషప్ దుర్గం ప్రభాకర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య ప్రసంగికులు పాస్టర్ సిహెచ్ శ్యామ్ ప్రసాద్ ఆలమూరు ,పాస్టర్ పి జె రూబెన్ చెన్నై ,పాస్టర్ సిహెచ్ డేవిడ్ బాపట్ల, అర్చ్ బిషప్ యం పి హెచ్ యస్ .మోజెస్ నల్గొండ, సిస్టర్ ఎలీస్ మద్దినేని ఆస్ట్రెలియా నుండి పాల్గొని క్రీస్తూ బోధనలు ప్రవచనాలు చెప్పి,600 మంది క్రైస్తవ భక్తులకు పేమ విందు ఏర్పాటు చేశారు, ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర క్రిస్టియన్ మైనారిటీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు రెవ ఇరుగు శాంసన్,పాస్టర్ ప్రేమయ్య,పాస్టర్ యం రూబెన్,పాస్టర్ హోసన్నా, పాస్టర్ గాబ్రియేల్,పాస్టర్ దేవయ్య,పాస్టర్ సురేష్ పాస్టర్ కోక ఏసురత్నం, పాస్టర్ భాస్కర్, పాస్టర్ పీటర్,వల్లపట్ల దయానంద్, వంగూరి దానియేలు, దేవరకొండ దానయ్య,ఆదిమల్ల బాబు,మామిడి ఉపేందర్, ప్రవీణ్, జాకార్య, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.