ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు

– స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీ కన్స్ట్రక్షన్
నవతెలంగాణ – కంటేశ్వర్
స్థానిక మారుతి నగర్ లో గల స్నేహ సొసైటి ఫర్ రూరల్ రీ కన్స్ట్రక్షన్ యొక్క దివ్యాంగుల పాఠశాలలో తెలంగాణ రాష్ట్రఅవతరణ దినోత్సవాన్నీ జాతీయ జెండాను ఎగురవేసి, తెలంగాణ తల్లి చిత్రపటానికి పూలమాల వేసి రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను ఘనంగా శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా నోముల రాంచంద్రరెడ్డి పాల్గోని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు.. భారతదేశానికి స్వాతంత్య్రం రాకముందు చదువుకోవడానికి చాలా కష్టపడేవాడని, ఆరోజుల్లో జమీందారి పిల్లలకు మంత్రమే చదువుకోవడానికి అవకాశాలు ఉండేవని తను చదువుకోవడానికి చాలా కష్టపడేవాడని తరగతాన్ని నెమర వేసుకున్నారు. సముజంలో ఏదైనా సాధించాలంటే చదువు చాలా ముఖ్యమని దానిని సాధించడానికి దివ్యాంగులు చాలని కష్టపడాలి అన్నారు. కష్టే ఫలి అన్న విధంగా కష్టపడితేనే ఫలితాలు సాధిస్తామని ప్రతి ఒక్కరు జీవితంలో ఎదుగాలంటే కష్టపడాలి అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, బాలాం అభివృద్ధిని చూస్తున్నామని హైదరాబాదులో నిర్మించబడ్డ చరిత్ర కట్టడాలు చాలా చారిత్రకమైనవని అవి తెలంగాణ రాష్ట్రంలో చాలా సూచికలు అన్నారు. ప్రతి ఒక్కరు పాజిటివ్ దృకృతంలో ఆలోచించాలని ప్రతి విషయాన్ని పాజిటివ్గా థింక్ చేయలని చెప్పారు. స్నేహం సొసైటిలో సాదిస్తున్నా ఫలితాల పట్ల తాను స్నేహ సొసైటికి సహాయ సహాకారాలు అందిస్తామని తెల్పారు.ఈ కార్య క్రమములో స్నేహ సొసైటీ కార్యదర్శి యస్. సిద్ధయ్య, స్నేహ సొసైటీ చేపట్టిన కార్యక్రములు, సాధించిన విజయులు గత 30 సంవత్సరాలుగా స్నేహ సొసైటీ అందించిన విజయాలను సేవలను వివరించారు. ఈ కార్యక్రమంలో స్నేహ సొసైటీ ప్రిన్సిపాల్ జ్యోతి వైస్ ప్రిన్సిపాల్ రాజేశ్వరి, అందుల ప్రత్యేక పాఠశాల ప్రిన్సిపాల్ విజయ, స్నేహ ప్రాజెక్టు మేనేజర్ మొహిజ్ అహ్మద్, రాము నోముల చారిటబుల్ ట్రస్ట్ వాసు గౌడ్, రిటైర్డ్ రెవెన్యూ ఉద్యోగి సురేందర్ గౌడ్, స్నేహ సొసైటీ వివిధ ప్రాజెక్టుల లో పనిచేసే సిబ్బంది అనగా మానసిక వికలాంగులు ప్రత్యేక పాఠశాల సిబ్బంది విద్యార్థులు, అందుల ప్రత్యేక పాఠశాల సిబ్బంది,అంద విద్యార్థులు ప్రాజెక్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా, అతిథిగా, వారిని ఘనంగా సన్మానించారు.

Spread the love