చంద్రయాన్‌-3

అతి తక్కువ బడ్జెట్‌తో రోదసీ రంగంలో ఎన్నో ప్రయోగాలు చేస్తుందని ఇస్రో గురించి ప్రపంచవ్యాప్తంగా గొప్పగా చెప్పుకుంటారు. అది నిజం కూడా. 2008 లో చంద్రయాన్‌ 1 ప్రయోగం ద్వారా చంద్రునిపై నీరు వుందని నిరూపించింది. 2019లో చంద్రయాన్‌ 2 ప్రయోగించి విఫలమయినా మళ్లీ ఈ సంవత్సరం 2023 జులై 14 న చంద్రయాన్‌ 3 ని అంతరిక్షంలోకి విజయవంతంగా పంపింది. చంద్రుని దక్షిణ ధ్రువంపై ఎవరూ చూడని నిగూఢ రహస్యాలను కనుగొనేందుకు ఈ చంద్రయాన్‌3 ను ప్రయోగించారు.
చంద్రయాన్‌-3 లక్ష్యాలు :
– చంద్రుని ఉపరితలంపై సురక్షితంగా ల్యాండ్‌ అవడం.
– చంద్రునిపై రోవర్‌ సంచరించే సామర్థ్యాలను గమనించడం, ప్రదర్శించడం.
– చంద్రుని ఉపరితలంపై లభ్యమయ్యే రసాయనాలు, సహజ మూలకాలు, నేల, నీరు మొదలైన వాటిపై అక్కడే శాస్త్రీయ ప్రయోగాలు, పరిశీలనలు చేయడం.
– రెండు గ్రహాల మధ్య యాత్రలు చేసేందుకు అవసరమైన కొత్త టెక్నాలజీని అభివృద్ధి చేయడం.
– భూమి, చంద్రుని మధ్య దూరం దాదాపు 3,84,400 కిలోమీటర్లు.
– చంద్రుడిపై ఒక రోజు అయితే భూమిపై 14 రోజులట.
6 చంద్రయాన్‌-3లో పంపిన రోవర్‌ చంద్రుడిపై ఒక్కరోజు మాత్రమే పనిచేస్తుందట. అంటే ఈ రోవర్‌ చంద్రుడిపై ఒకరోజు పరిశోధన చేస్తే, మనం 14 రోజులపాటు అధ్యయనం చేసినట్టు భావించాలి.
– చంద్రయాన్‌-3 రోవర్‌ జీవితకాలం కూడా ఒక్కరోజేనట.

Spread the love