భూగర్భ జలాలు పెంచేందుకే చెక్‌డ్యామ్‌

– ఎమ్మెల్యే కాలె యాదయ్య
– నవతెలంగాణ-నవాబ్‌ పేట
భూగర్భ జలాలు పెంచేందుకే చెక్‌డ్యామ్‌లని ఎమ్మెల్యే కాలే యాదయ్య అన్నారు. మండల పరిధి లోని గంగ్యాడ గ్రామంలో మూసి బ్రిడ్జి వద్ద చెక్‌డ్యామ్‌ను ఆకస్మికంగా ఎమ్మెల్యే కాలే యాదయ్య పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. నియోజక వర్గంలో అదనంగా 30 వేల ఎకరాలకు సాగు నీరు పెరగనున్న భూగర్భజలాలు సాగు నీటి ఇక్కట్లకు చెక్‌ పెట్టేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలు సత్ఫలి తాలు ఇస్తున్నాయన్నారు. చెక్‌డ్యామ్‌ల నిర్మాణంతో భూగర్భ జలాలు పెరుగుతున్నయని ఆయనన్నారు. పలు ప్రాంతాల్లో మత్తడి దూకుతూ నీరు ప్రవహి స్తుదని వృథాగా పోతున్న వర్షపునీటికి అడ్డుకట్ట వే స్తూ చెక్‌ డ్యామ్‌లు నిర్మించాలనేది ప్రభుత్వం లక్ష్యం గా పెట్టుకుందన్నారు. చెక్‌డ్యామ్‌ల వల్ల దాదాపు 3 టీఎంసీల నీరు అదనంగా నిల్వ ఉంటుందన్న అంచ నాలున్నాయని సుమారు 30 వేల ఎకరాలకు అద నంగా సాగునీరు అందుతోందని తెలిపారు. సం వత్సరమంతా వాగుల్లో నిల్వ ఉండే నీటిని రైతులు మోటార్ల ద్వారా పంటలకు మళ్లించుకునే అవకాశా లున్నాయని వాగుకట్టలకు ఇరువైపులా గ్రావిటి కా లువలను తవ్వి పంటలకు సాగు నీరు అందే వీలుం టుదన్నారు. వాగుల్లో చెక్‌ డ్యామ్‌లతో అడ్డుకట్టలు కట్టడం వల్ల నీటి నిల్వలుండడంతో పాటు వరద ముంపు సైతం తగ్గుతుందన్నారు. చెక్‌డ్యామ్‌ నిర్మిం చిన ప్రతీ ప్రాంతంలోనూ 4 నుంచి 15 మీటర్ల ఎత్తువరకు నీరు నిలిచి ఉంటోందన్నారు. వరద నీరు ఎక్కువయిన సందర్భాల్లో వాగుల్లో నుంచి నీరు వృథాగా గండిపేట వెళుతోందన్నారు. వాగుల నుం చి వథాగా మూసీ జలాలను నివారించడానికి అను గుణంగా అడ్డుకట్టలను నిర్మించారని తెలిపారు. ఎమ్మెల్యేతో మండల నాయకులు, తదితరులున్నారు.