7వ బెటాలియన్ లో ధర్బార్ పరేడ్ నిర్వహించిన కమాండెంట్..

నవతెలంగాణ -డిచ్ పల్లి
తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక పోలీస్ 7వ బెటాలియన్ కమాండెంట్ బి.రామ్ ప్రకాష్ నూతనంగా బెటాలియన్ కమాండెంట్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వత లెక్చరల్ హాల్ లో ధర్బార్ పరేడ్ ను శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కమాండెంట్ బి రామ్ ప్రకాష్  బెటాలియన్ అధికారులు, సిబ్బంది సమస్యలను, వెల్ఫేర్ గురించి అడిగి తెలుసుకున్నారు. అదే విధంగా ప్రతి ఒక్కరు క్రమశిక్షణతో తమ విధుల పాట్లా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్స్ యస్. విష్ణుముర్తి, సి. ఆంజనేయ రెడ్డి, కె. బాస్కర్ రావు, ఆర్.ఐలు యం. రాజు, పి. వేంకటేశ్వర్లు, ఆర్. సర్దార్ నాయక్, బి. అనిల్ కుమార్, యల్. మహేష్, యం. నరేష్, కె. శ్యాంరావు, ఆర్. ప్రహల్లాద్, సి. సురేష్, బి. వసంత్ రావు, ఆర్.యస్.ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.
Spread the love