కామన్‌ విద్యా విధానాన్ని అమలు చేయాలి

మన దేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలైన తెలం గాణ, ఆంధ్రపదేశ్‌ రాష్ట్రాలలోని విద్యా విధానంలో వివిధ మేనేజ్‌మెంట్లు ఉండటం వల్ల విద్యా విధానం గందరగోళంగా మారుతుంది. దేశవ్యాప్తంగా కామన్‌ విద్యా విధానాన్ని ప్రవేశ పెట్టడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. దేశ వ్యాప్తంగా ఒకేసారి పరీక్షలు నిర్వహించడం ఒకేసారి ఫలితాలు ప్రకటిం చడం ఒకేసారి ఉన్నత చదువులు చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుత విద్యా విధానంలో ప్రభుత్వ, పంచాయతీ రాజ్‌, మున్సిపల్‌, ఎయిడెడ్‌, కార్పొరేట్‌, మైనార్టీస్‌, మోడల్‌ స్కూల్‌, పబ్లిక్‌ స్కూల్‌లు, నవోదయ స్కూల్‌లు, కేంద్రీయ, గురుకుల పాఠశాలలు, స్పోర్ట్స్‌ స్కూల్‌లు, మిలిట్రీ స్కూల్‌, సైనిక్‌ స్కూల్‌లు, ప్రయివేటు స్కూల్‌లు అనేకం ఉన్నాయి. భారతీయ విద్యా విధానంలో త్రిభాషా సూత్రంను అమలు చేస్తున్నారు. ప్రథమ భాషగా మాతృభాష (తెలుగు రాష్ట్రాలలో తెలుగు, ఉర్దూ) ద్వితీయ భాషగా హిందీ, తృతీయ భాషగా ఇంగ్లీష్‌ అనేక పాఠశాలలలో త్రిభాషా సూత్రంను పాటించ కుండా ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలలో మాతృభాష తెలుగును తప్పనిసరి చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులను జారీ చేసింది. పదవ తరగతి వరకు తెలుగును తప్పని సరిగా అభ్యసించాలనే నియ మ నిబంధనలు రూపొందించినది. అనేక పాఠశాలలలో ప్రభు త్వ ఉత్తర్వులను ఏ మాత్రం ఖాతరు చేయకుండా పదవ తర గతి వరకు తెలుగు చదవకుండానే పదవ తరగతి పూర్తి చేస్తు న్నారు. తెలుగుకు బదులుగా సంస్కృతం, రష్యన్‌, ఫ్రెంచ్‌, చైనీ స్‌ మిగతా భాషలను చదువుతున్నారు. తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో పదవ తరగతి వరకు తెలుగు భాష ను అమలు చేయని పాఠశా లలపై చట్ట రీత్యా చర్యలు తీసుకోవడానికి అవ కాశం ఉంది. అధికారుల నిర్లక్ష్య, నిర్లిప్త ధోరణి, అవినీతి వలన ప్రయివేటు పాఠశాలలో ఆడిందే ఆటగా మారింది.
ప్రభుత్వ పాఠ్యపుస్తకాల అమలేది?
మన దేశంలో జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఎస్‌సిఆర్‌టి ఉన్నాయి. విద్యార్థుల స్థాయిని బట్టి పాఠ్య పుస్తకాలను రూపొందిస్తారు. విద్యార్థుల స్థాయిని బట్టి, వారి తరగతిని బట్టి పాఠ్య పుస్తకాలను సబ్జెక్టులో అను భవం కలిగిన సబ్జెక్టులో నిష్ణాతులైన వారి చేత పాఠ్య పుస్తకా లను రూపొందించి జాతీయ, రాష్ట్ర స్థాయిలో ఎస్‌సిఆర్‌టి పుస్తకాలను ఒకటి నుండి పదవ తరగతి వరకు అమలు చేయాలనే ప్రభుత్వ నిబంధనలు ఉన్నాయి. కొన్ని పాఠశాలలు ప్రభుత్వ నిబంధనలను ఏ మాత్రం పాటించకుండా పాఠశాల స్థాయిలో పుస్తకాలను రూపొందించి తమ స్వీయ ఎజెండా అమలు చేస్తున్నారు. పదవ తరగతిలో పబ్లిక్‌ ఎగ్జామ్స్‌ ఉన్నం దున అనేక ప్రయివేటు పాఠశాలలు పాఠ్య పుస్తకాలను చదివిం చకుండా కేవలం ప్రశ్న జవాబులను మాత్రమే చదివిస్తూ విద్యార్థులకు మంచి గ్రేడింగ్‌ రావడానికి ప్రయత్నిస్తు న్నారు. విద్యార్థులకు మార్కులు, గ్రేడిం గ్‌ విధానంపై దృష్టిని కేంద్రీకరిస్తున్నా రు. విద్యార్థుల మానసిక, భౌతిక విష యాలపై దృష్టిని కేంద్రీకరించడం లేదు. పదవ తరగతి పబ్లిక్‌ ఎగ్జామ్స్‌ తరువాత ఇంటర్మీడియట్‌ ఆ తర్వాత జరగ నున్న ఐఐటి కోసం మూడు, నాలుగవ తరగతి నుండే ఐఐటి బోధన పేరిట విద్యార్థులకు మానసిక ఒత్తిడికి గురి చేస్తు న్నారు. దీనికితోడు పబ్లిక్‌ స్కూల్స్‌లో, ప్రయివేటు పాఠశాలల్లో ప్రతి సంవత్సరం ఫీజులను తమకు ఇష్టానుసారం పెంచుకుంటుపోతున్నారు. పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు ఫీజుల భారం ఎక్కువగా ఉంది. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని పాఠశాలల్లో ఫీజులను ఖరారు చేసింది. ప్రయివేట్‌ పాఠశాలల యాజమాన్యాలు ప్రభుత్వ ఉత్తర్వులను ఖాతరు చేయకుండా అధిక మొత్తాల్లో డబ్బులను ఫీజుల రూపంలో వసూలు చేస్తున్నారు. విద్యా వ్యాపార సంస్థగా మారింది.
కామన్‌ విద్యా విధానాన్ని అమలు చేయాలి…
జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలలో అధికారులు పిల్లలు, నాయకుల పిల్లలు, పేద, మధ్యతరగతి ప్రజల పిల్లలు చదవడానికి కామన్‌ విద్యా విధానంను అమలు చేయాలి. జాతీయ స్థాయిలో కేంద్ర కేబినెట్‌ 2023-24 విద్యా సంవత్సరానికి ఆమోదించిన 1+5+3+4 విద్యా విధానం అన్ని పాఠశాలల్లో అమలు అయ్యేటట్లు చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ పాఠశాలలలో తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలలో ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన 2022-23 విద్యా సంవత్సరం నుంచి అమలు జరపడం వల్ల అనేక మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చదవడానికి ఆసక్తిని చూపిస్తున్నారు. మన ఊరు – మన బడి కార్య క్రమాలు ప్రభుత్వ పాఠశాలకు కొత్త ఊపిరిని పోస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, విద్యా సంబంధిత అధికారులు జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో కామన్‌ విద్యా విధానంపై దృష్టిని కేంద్రీకరించి విద్యా వ్యాపారంను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.
– డాక్టర్‌.ఎస్‌.విజయభాస్కర్‌, 9290826988

Spread the love