రిత్విక్‌ వెంచర్‌లో నివసిస్తున్న కుటుంబాల అవస్థలు

నవతెలంగాణ-శంకర్పల్లి
మున్సిపల్‌ పరిధిలోని రిత్విక్‌ వెంచర్‌లో నివసిస్తున్న కుటుంబాలు వర్షాలకు అవస్థలు పడుతున్నామని కాలనీ వాసులు వాపోయారు. గురువారం వారు విలేకరుల ముం దు వాపోతూ ఈ రిత్విక్‌ వెంచర్‌ కోసం పక్కన ఉన్న గొల్ల వాగుపై బ్రిడ్జి నిర్మించారు. గత సంవత్సరం కురిసిన భారీ వర్షానికి బ్రిడ్జిలో సగభాగం కూలిపోయింది. మిగతా భా గం కూలిపోయే దశలో ఉంది. ప్రస్తుతం కురుస్తున్న వర్షా లకు బ్రిడ్జిపై నుండి కార్లు నడపడానికి కాలనీవాసులు భయపడుతున్నారు. ఎప్పుడు బ్రిడ్జి కూలిపోతుందోనని వా పోతున్నారు. గత సంవత్సరమే కాలనీలో వాసులకోసం మున్సిపాలిటీ వారు వ్యవసాయ మార్కెట్‌ కమిటీ నిర్మించి న ప్రహరీ గోడను కూల్చి కార్లు వెళ్లడానికి దారిని ఏర్పాటు చేశారు. గతవారం ఏఎంసి సిబ్బంది ఆ రోడ్డుపై గుంతలు తీసి కారులు వెళ్లకుండా చేశారు. దీంతో కూలిపోయే దశలో ఉన్న బ్రిడ్జి పైనుండి బిక్కుబిక్కుమంటూ వెళుతూ భయాందోళనకు గురవుతూ కార్లు నడుపుతున్నారు. కాలనీలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. అడుగులోతు వర కు రోడ్డుపై నీళ్లు నిలవడంతో ముఖ్యంగా చిన్నపిల్లలు ఇ బ్బందులు పడుకున్నారు. కాలనీలో సుమారు 50 కుటుం బాలు నివసిస్తున్నాయి. ప్రతి సంవత్సరం వేల రూపాయ లు పన్ను రూపంలో మునిసిపాలిటీకి చెల్లిస్తున్న వారు ప ట్టించుకోవడంలేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మున్సి పాలిటీ అధికారులు వెంటనే స్పందించి వారి సమస్యలను పరిష్కరించాలని కోరారు. వ్యవసాయ మార్కెట్‌ కమిటీ అధికారులు రోడ్డుపై తవ్విన గుంతలను పూడ్చి కారులు వెళ్లడానికి సదుపాయం కల్పించాలని అలాగే కూలి పో యిన బ్రిడ్జి నిర్మాణం పనులు చేపట్టాలని తెలిపారు.

Spread the love