– టీయూ లో కోనసాగుతున్న ఆందోళన..
నవతెలంగాణ-డిచ్ పల్లి
మా జీవితాల్లో వెలుగుల్ని నింపాలని సీఎం కెసిఆర్ ను కాంట్రాక్ట్ అధ్యాపకులు విన్నవించారు.మా పాట్లా కనికరం చూపలని, ముఖ్యమంత్రి కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను వెంటనే రెగ్యులరైజ్ చేయాలని వెడుకున్నరు. కాంట్రాక్ట్ అధ్యాపకుల దినచర్య కార్యక్రమంలో భాగంగా బుధవారం ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ ముందు తమ నిరసనను వ్యక్తం చేశారు. ఏకైక డిమాండ్ రెగ్యులరైజ్ టు సర్వీస్ ఉందని పేర్కొన్నారు.ఈ సందర్భంగా తెలంగాణ యూనివర్సిటీ కాంట్రాక్ట్ అధ్యాపకుల సంఘం అధ్యక్షులు డాక్టర్ వి దత్త హరి మాట్లాడుతూ 12 యూనివర్సిటీలో జరుగుతున్న యాక్టివిటీస్ ని దృష్టిలో పెట్టుకొని మేము కూడా రెగ్యులరైజ్ కోసం మా యొక్క యాక్టివిటీస్ ని కంటిన్యూ చేస్తున్నామని, సమాన పనికి సమాన వేతనం చెల్లించి మాకు రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఇచ్చిన మాటను తూచా తప్పకుండా అమలు చేస్తారని ఎంతో ఆశతో ఎదురుచూస్తున్న 12 యూనివర్సిటీ లకు చెందిన కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను ఉన్నారన్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ యూనివర్సిటీ కాంట్రాక్ట్ అధ్యాపకులు శరత్, గోపిరాజ్, జలంధర్, దేవరాజ్ శ్రీనివాస్, సిహెచ్ శ్రీనివాస్, రామేశ్వర్ రెడ్డి, రమ్య, రాజేశ్వరి, అపర్ణ, గంగ కిషోర్, నాగేశ్వరరావు, నాగేంద్రబాబు, స్వామి రావు, మోహన్, కిరణ్ రాథోడ్ తో పాటు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో డాక్టర్ నాగేశ్వరావు, డాక్టర్ అపర్ణ, డాక్టర్ రాజేశ్వరి, డాక్టర్ జోష్ణ, డాక్టర్ స్వామి రావు, డాక్టర్ నాగేంద్రబాబు, డాక్టర్ సురేష్, డాక్టర్ రాజేశ్వర్, జలంధర్ ,డాక్టర్ మోహన్, నాగేంద్రబాబు, గోపి రాజ్, జి శ్రీనివాస్, కిరణ్ రాథోడ్, డాక్టర్ శ్వేత, డాక్టర్ డానియల్, డాక్టర్ గంగ కిషన్, డాక్టర్ బి ఆర్ నేత, డాక్టర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.