కాంట్రాక్ట్‌ అధ్యాపకులను రెగ్యులరైజ్‌ చేయాలి

– జేఏసీ ఆధ్వర్యంలో కేయూ వద్ద ధర్నా
నవతెలంగాణ-కేయూ క్యాంపస్‌
రాష్ట్రంలోని 13 విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ అధ్యాపకులను రెగ్యులరైజ్‌ చేయాలని తెలంగాణ ఆల్‌ యూనివర్సిటీస్‌ కాంట్రాక్ట్‌ టీచర్స్‌ జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం కాకతీయ యూనివర్సిటీ మొదటి గేటు ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఆల్‌ యూనివర్సిటీస్‌ కాంట్రాక్ట్‌ టీచర్స్‌ జేఏసీ చైర్మెన్‌ డాక్టర్‌ శ్రీధర్‌ కుమార్‌లోథ్‌ మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా 13 విశ్వవిద్యాలయాల్లో 1356 మంది కాంట్రాక్ట్‌ అధ్యాపకులు పనిచేస్తున్నారని, వారందరినీ రెగ్యులరైజ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు.
డిగ్రీ కళాశాల కాంట్రాక్ట్‌ అధ్యాపకులు, పాలిటెక్నిక్‌ కళాశాల కాంట్రాక్ట్‌ అధ్యాపకులను రెగ్యులరైజ్‌ చేసిన ప్రభుత్వం.. యూనివర్సిటీ కాంట్రాక్ట్‌ అధ్యాపకుల్ని చేయకపోవడం బాధాకరమని అన్నారు.
తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి యూనివర్సిటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ అధ్యాపకులనులందర్నీ రెగ్యులరైజ్‌ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ ప్రధాన కార్యదర్శి ఆర్‌డి ప్రసాద్‌, కో-చైర్మెన్‌ జరుపుల చందూలాల్‌, డాక్టర్‌ డి.బిక్షపతి, డాక్టర్‌ మధుకర్‌రావు, డాక్టర్‌ కల్పన, స్వప్న, డాక్టర్‌ చీకటి శ్రీనివాస్‌, డాక్టర్‌ మధుసూదన్‌, డాక్టర్‌ బి.ప్రియాంక, డాక్టర్‌ సుకన్య, డాక్టర్‌ విజరుకుమార్‌, శశిధర్‌, డాక్టర్‌ శ్రీధర్‌ రావు, రాజన్‌ బాబు, కవిత తదితరులు పాల్గొన్నారు.

Spread the love