దరఖాస్తులలో వివరాలు సరిచేసుకోండి

– ఎస్సై, కానిస్టేబుల్‌ అభ్యర్థులకు టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ చైర్మెన్‌ విజ్ఞప్తి
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
ఎస్సై, కానిస్టేబుల్‌ అభ్యర్థులు తమ దరఖాస్తులలో ఏదైనా పొరపాటు ఉన్నా.. సరిదిద్దుకోవాలని రాష్ట్ర పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు చైర్మెన్‌ వి.వి శ్రీనివాస్‌రావు తెలిపారు. టీఎస్‌ఎల్‌పీఆర్‌బీకి చెందిన అధికారిక వెబ్‌సైట్‌లో అభ్యర్థుల దరఖాస్తులను పొందుపర్చటం జరిగిందనీ, ఆరో తేదీ నుంచి 8వ తేదీ వరకు అభ్యర్థులు ఏవేనీ మార్పులుంటే సరిదిద్దుకోవాలని ఆయన సూచించారు. ఈ సమయం మించితే మరోసారి అవకాశం ఇవ్వబోమని స్పష్టం చేశారు. అలాగే, తుది పరీక్షకు సంబంధించి కొందరు అభ్యర్థులు రీ కౌంటింగ్‌, రీవాల్యూయేషన్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారనీ, ఎస్సై, కాని స్టేబుల్‌ల పోస్టులకు సంబంధించి మొత్తం 3,58,000 మంది తుది రాత పరీక్షను రాయగా అందులో 0.38 శాతం మంది అభ్యర్థులు ఇందుకోసం దర ఖాస్తు చేసుకున్నారని ఆయన చెప్పారు. దీనికి సంబంధించిన ఫలితాలను మంగళవారం (6న) తమ అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను వెల్లడించను న్నామని తెలిపారు. కాగా, తుది రాత పరీక్షలో అర్హత సాధించిన ఎస్సై, కాని స్టేబుల్‌ అభ్యర్థులు తమ కులధ్రువీకరణ పత్రాలతో పాటు ఇతర అవసరమైన పత్రాలను కూడా వెరిఫికేషన్‌ కోసం సిద్ధం చేసుకోవాలనీ, ఈ వెరిఫికేషన్‌ ఎప్పుడు ప్రారంభించేది త్వరలోనే ప్రకటిస్తామని ఆయన తెలిపారు.

Spread the love