తిరుమలలో భక్తుల రద్దీ..

నవతెలంగాణ-హైదరాబాద్ : వీకెండ్ కారణంగా నేడు (శుక్రవారం) భక్తులతో తిరుమల కిటకిటలాడుతోంది. టోకెన్ రహిత సర్వదర్శనానికి క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్లన్నీ నిండి క్యూ లైన్లు వెలుపలికి వచ్చాయి. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. గురువారం 67,294 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4.09 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. 33,529 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.