తిరుమలలో భక్తుల రద్దీ..

tirumala tempelనవతెలంగాణ -హైదరాబాద్ : తిరుమలలో నేడు (గురువారం) భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్ రహిత సర్వదర్శనం కోసం భక్తులు 18 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. స్వామివారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. అయితే ముందే బుక్ చేసుకున్న భక్తులకు దర్శనం కాస్త త్వరగా అవుతోంది. బుధవారం 74,024 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 3.96 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. 32688 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు.