ధరణి సమస్యలు పరిష్కరించాలి

– వీడియో కాన్ఫరెన్స్‌లో రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్‌ మిట్టల్‌
కలెక్టర్లు, అధికారులతో వీసీ
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
ధరణిలో భూ సమస్యలను త్వరిత గతిన పరిష్కరించేందుకు చర్యలు తీసు కోవాలని రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్‌ మిట్టల్‌ సూచించారు. శుక్రవారం హైదరాబాద్‌ నుంచి రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ నవీన్‌ మిట్టల్‌ జిల్లా కలెక్టర్లు, రెవెన్యూ అధికారులు, తహసిల్దార్‌లతో వీడియో సమావేశం నిర్వహించారు. జీఓ 58, 59, 76, 118 కింద భూ క్రమబద్దికరణ, ధరణి పెండింగ్‌ దరఖాస్తులు, ధరణిలో నూతన ఆప్షన్‌పై సమీక్షించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్‌ హరీష్‌ మాట్లాడుతూ జీఓ 58 కింద 19661 దరఖాస్తులు అందాయని, 4552 డిస్పోజ్‌ చేశామని తెలిపారు. 59 కింద 13231 దరఖా స్తులు అందాయని, 118 కింద వచ్చిన 5802 దరఖా స్తులు అందాయని 4947 దరఖాస్తులను డిస్పోజ్‌ చేశామ ని తెలిపారు. మిగిలిన దరఖాస్తులు త్వరగా పరిష్కరిం చేందుకు చర్యలను చేపడుతామని వివరించారు. 58, 59, 118 కింద రంగారెడ్డి జిల్లాలో పెండింగ్‌లో ఉన్న దరఖా స్తులను క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి వెంటనే పరిష్కరిసాతమని, ధరణి పెండింగ్‌ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ తెలిపారు. ఈ సమావేశం లో అదనపు కలెక్టర్లు ప్రతిక్‌ జైన్‌, తిరుపతిరావు, జిల్లా రెy ెన్యూ అధికారి హరీప్రియ, ఆర్డీఓలు వెంకటాచారి, సూరజ్‌, వేణుగోపాల్‌, తాసిల్దారులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
వికారాబాద్‌ ప్రతినిధి : ధరణి పెండింగ్‌ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్‌ మిట్టల్‌ అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్లు, రెవెన్యూ అధికారులు, తహసిల్దార్లతో హైదరాబాద్‌ నుండి వీడియో సమావేశం నిర్వహించారు. జీఓ 58, 59, 76, 118 కింద భూ క్రమబద్దికరణ, ధరణి పెండింగ్‌ దరఖాస్తులు, ధరణిలో నూతన ఆప్షన్‌ పై సమీక్షించారు. ఈ సందర్భంగా రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్‌ మిట్టల్‌ మాట్లాడుతూ జీఓ 59 కింద గతంలో వచ్చిన దరఖాస్తులలో 10 లక్షల కంటే అధికంగా చెల్లించాల్సిన 1458 దరఖాస్తుదారులు ఇప్పటి వరకు చెల్లింపులు ప్రారంభించలేదని, వెంటనే వారికి నోటీసులు జారీ చేసి చెల్లింపుచేసేలా చూడాలని సూచించారు. జీఓ 59 కింద లక్ష లోపు చెల్లించాల్సిన 3689 దరఖాస్తుదారులకు సైతం నోటీసు అందించి త్వరితగతిన చెల్లింపు చేసేలా అవగాహన కల్పించాలని ఆయన తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్‌ (రెవెన్యూ) లింగ్యా నాయక్‌, సెక్షన్‌ సూపరింటెండెంట్‌ హరిత, తదితరులు పాల్గొన్నారు.

Spread the love