
విద్యార్థిని అదృశ్యమైన ఘటన బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని గొల్లపల్లికి చెందిన జిర్ల మహేష్ బతుకుదెరువు కోసం భార్యాభర్తలు హైదరాబాదులో పనిచేస్తున్నారు. ఇద్దరు కుమారులు, కూతురు గొల్లపల్లి లో ఉంటున్నారు. కూతురు సాహితీ 18 బుధవారం కామారెడ్డిలోని ఎస్ ఆర్ కె డిగ్రీ కాలేజ్ వెళ్తున్నానని చెప్పి, రాత్రి అయిన ఇంటికి రాకపోవడంతో, చుట్టుపక్కల, బంధువుల ఇండ్లలో వెతికిన దొరకకపోవడంతో అన్న జీర్ల సాయికుమార్ గురువారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై అనిల్ తెలిపారు.