నవీపేట్ లో కరపత్రాల ఆవిష్కరణ

నవతెలంగాణ- నవీపేట్: అభ్యుదయ గ్రామీణ వికాస సంఘం ఆర్య సమాజ్ ఆధ్వర్యంలో ఈనెల 30వ తేదీన నిర్వహించే “ఏక దివషియ దేశభక్తి సహిత, ఆధ్యాత్మిక ధ్యాన చింతన” శిబిరము కరపత్రాలను ఆదివారం ఆవిష్కరించారు. అనంతరం ప్రచారంలో భాగంగా ఇంటింటికి వెళ్లి కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ శిబిరానికి ప్రజలందరూ హాజరుకావాలని కోరారు. ఈ కార్యక్రమంలో గంజి సాయన్న, నరేంద్ర శేఖర్, నాంపల్లి వసంత్, రాజారెడ్డి, సంజీవరెడ్డి ఆర్య సమాజ్ ప్రతినిధులు పాల్గొన్నారు.
Spread the love