రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో చిరు వ్యాపారులకు తోపుడు బండ్లు వితరణ

నవతెలంగాణ-ఆర్మూర్
రోటరీ క్లబ్ ఆఫ్ లెక్ డిస్ట్రిక్ట్ మొహీనాబాద్, రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ వారు సంయుక్తంగా నిర్వహించిన ప్రాజెక్టులో భాగంగా బుధవారం రోటరీ మాజీ డిస్టిక్ గవర్నర్ పెర్కిట్ మాజీ సర్పంచ్ ఎన్.వి హనుమంతు రెడ్డి తన తండ్రి వెంకట్ రెడ్డి స్మారకార్థం తల్లి లక్ష్మి చేతుల మీదుగా 10 తోపుడుబండ్లను చిరు వ్యాపారులకు ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ అధ్యక్షులు బండారి ప్రసాద్ మాట్లాడుతూ చిరు వ్యాపారుల ఆర్థిక స్వవలంబనకై తోపుడు బండ్లను పంపిణీ చేయడం చాలా గొప్ప విషయమని తెలిపారు. వీటి విలువ 1,40,000 ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు చైర్మన్ లు గా కాంతి గంగారెడ్డి, రాజేందర్ రెడ్డిలు వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి లక్ష్మీ నారాయణ, కోశాధికారి పట్వారి తులసి, చరణ్ రెడ్డి, మంచిర్యాల సురేష్ కుమార్, లింబాద్రి గౌడ్, రజనీష్, గోపికృష్ణ, సత్యం, పద్మ మురళి, రాంప్రసాద్, దాము కాందేశ్ సత్యం తదితరులు పాల్గొన్నారు.

Spread the love