మన ఊరు మనబడి కార్యక్రమాన్ని పరిశీలించిన జిల్లా విద్యాధికారి రాజు

నవతెలంగాణ -రాజంపేట్
మండలంలో నిర్వహిస్తున్నటువంటి మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా గురువారం జిల్లా విద్యాధికారి రాజు పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మండలంలోని షేర్ శంకర తండా, కొండాపూర్, శివాయపల్లి ప్రాథమిక పాఠశాలలో పనులను పరిశీలించానని అదేవిదంగా రీడింగ్ కంపైన్ ప్రోగ్రాం లో భాగంగా అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు సూచనలు ఇవ్వడం జరిగింది. రీడింగ్ కంపైన్ ప్రోగ్రాం జూన్26 నుండి జులై31 వరకు జరుగుతుందని ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఎస్ ఓ శ్రీపతి మండల విద్యాధికారి రామస్వామి, సి ఆర్ పి లు పాల్గొన్నారు.