బాధితుల ఇండ్లను పరిశీలించిన డీఎల్పీఓ అనిత

నవతెలంగాణ-నవాబ్‌పేట్‌
మూడు రోజుల నుండి ఎడతెరిపి లేకుండా కులుస్తున్న భారీ వర్షానికి మండల పరిధిలో పులు మామిడిలో కమ్మె ట శివరాజమ్మ ఇంటి గోడ కూలింది. విషయాన్ని తెలు సుకొని వికారాబాద్‌ డీఎల్పీఓ అనిత, నవాబ్‌పేట్‌ ఎంపీ వో విజరుకుమార్‌ పులిమా మిడి ఉపసర్పంచ్‌ సుధాకర్‌ బాధితురాలు ఇంటికి వెళ్లి పరిశీలించారు. ఈ సంద ర్భంగా డీఎల్పీఓ ఇంట్లో ఉన్న సభ్యులకు వర్షం నుండి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఈ సందర్భంగా ఎంపీఓ విజరు కుమార్‌ ఇళ్లలో నివసిస్తున్న వారు వెంటనే ఇల్లు కాలి చేసి సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని కోరారు. ఏదై నా ఇబ్బందులుంటే గ్రామపంచాయతీ సెక్రటరీ దృష్టికి, సర్పంచ్‌ దృష్టికి తీసుకురావాలన్నారు.