సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి డీఎల్‌ పీఓ శంకర్‌ నాయక్‌

నవతెలంగాణ-కొడంగల్‌
సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని డీఎల్‌పీఓ శంకర్‌ నాయక్‌ అన్నారు. సోమ వారం మండలంలోని అన్నారం, నాగారం, చిట్లపల్లి గ్రా మాల్లో డీఎల్‌పీఓ శంకర్‌ నాయక్‌ ఎంపీఓ శ్రీనివాస్‌తో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా నర్సరీ, కాంపోస్టు షెడ్‌, మురుగు కాలువలు, గ్రామాల్లోని పరిసరాలను పరిశీ లించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హరిత హారానికి మొక్కలను సిద్ధం చేయాలన్నారు. వర్షాకాలం ప్రారంభం కావడంతో సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా వంద శాతం పారిశుధ్య పనులు చేయించాలన్నారు. మురు గునీరు నిలవకుండా ఎప్పటికప్పుడు మురుగు కాలువలు శుభ్రం చేయాలన్నారు. తడి, చెత్త ద్వారా వర్మి కంపోస్ట్‌ తయారు చేయాలన్నారు. వర్షాకాలం ప్రారంభం కావడం తో కూలిపోయేందుకు సిద్ధంగా ఉన్న ఇళ్లల్లో ఎవరైనా ఉంటే సురక్షితంగా ఉన్న బంధువుల ఇళ్లలో, ప్రభుత్వ పాఠశాలలో, అంగన్‌వాడీ కేంద్రాల్లో తాత్కాలికంగా ఉండే విధంగా చూడాలన్నారు. గ్రామాల్లో నీటి పైపులు పగిలి నచో వాటికి మరమ్మతులు చేయాలన్నారు. గ్రామాల్లో దో మల గుడ్లు పెరగకుండా బైటెక్స్‌ ద్రావణం, మెలాతీయన్‌ ద్రావణం అవసరమైన మెర ఉన్నాయో లేదో సరి చూసు కోవాలన్నారు. పిచ్చి మొక్కలు, పోదలను ఎప్పటికప్పుడు తొలగించాలన్నారు. వాటర్‌ ట్యాంకులను క్రమం తప్పకుం డా శుభ్రం చేయాలన్నారు. రోడ్లపై గుంతలలో నీరు నిలవ కుండా చూడాలని బ్లీచింగ్‌ పౌడర్‌, హైపోక్లోరైడ్లను అందు బాటులో ఉంచుకోవాలన్నారు. గ్రామంలో ఎవరైనా జ్వరం, డెంగు, మలేరియా వంటి లక్షణాలుంటే ఆశా వర్కర్లకు, వైద్య సిబ్బందికి సమాచారం ఇవ్వాలన్నారు. పంచాయతీ కార్యదర్శులు సమయపాలన పాటించాలన్నారు. చిట్లపల్లి గ్రామంలో అక్రమంగా ఏర్పాటు చేసిన లే అవుట్లను తొల గించాలని సూచించారు. గ్రామపంచాయతీ అనుమతితో ఇల్లు నిర్మించుకోవాలన్నారు.

Spread the love