స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీ కన్స్ట్రక్షన్ కు టెలివిజన్ అందజేత

నవతెలంగాణ – కంటేశ్వర్
స్థానిక మారుతి నగర్ లో గల రామ్ నోముల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్ట్ అధ్యక్షులు నోముల రామచంద్ర రెడ్డి స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీ కన్స్ట్రక్షన్ వారికి అందుల ప్రత్యేక పాఠశాల మానసిక వికలాంగుల ప్రత్యేక పాఠశాలకు టెలివిజన్ ను శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగ విద్యార్థులకు మానసిక వికలాంగులకు సేవలందిస్తున్న స్నేహ సొసైటీని అభినందించారు దివ్యాంగుల సంక్షేమం కొరకు తన వంతు సహకారాన్ని అందిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో రామ్ నోముల చారిటబుల్ ట్రస్ట్ ఉపాధ్యక్షులు నోముల అంజలి కార్యదర్శి వాసు గౌడ్ స్నేహ సొసైటీ కార్యదర్శి సిద్దయ్య తదితరులు పాల్గొన్నారు.

 

Spread the love