కంటి చూపు పై అశ్రద్ధ వద్దు..

– అత్హాంగ్ టోల్ ప్లాజా ప్రాజెక్టు మేనేజర్ విజయ్ కుమార్..
నవతెలంగాణ – డిచ్ పల్లి
కంటి చూపు పై ఎలాంటి శ్రద్ధ వహించవద్దని ఏదైనా తేడాలు కనిపిస్తే వెంటనే ఆస్పత్రులకు వెళ్లి కంటి పరీక్షలు చేయించుకోవాలని అత్హాంగ్ డిచ్ పల్లి టోల్ ప్లాజా ప్రైవేట్ లిమిటెడ్ ప్రాజెక్ట్ మేనేజర్ విజయకుమార్ అన్నారు.శనివారం ఇందల్ వాయి మండల కేంద్రంలోని అత్హాంగ్ టోల్ వే ప్రైవేట్ లిమిటెడ్ లో అజాదిక అమృత్ మహోత్సవం లో భాగంగా కంటి శిబిరం నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రాజెక్టు మేనేజర్ విజయ్ కుమార్, మెయింటెనెన్స్ మేనేజర్ గౌరీ నాయుడు, రూట్ ఆపరేషన్ మేనేజర్ నీరజ్ దేశ్ పాండే,సిఓఐసి వీరబాబు,టోల్ ప్లాజా మెనెజార్ చలపతి రావులు మాట్లాడుతూ అజహం టోల్ ప్లాజా ఆధ్వర్యంలో ఇప్పటికీ అజాదిక అమృత్ మహోత్సవంలో భాగంగా సేఫ్టీ అవేర్నెస్ కార్యక్రమంతో పాటు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించామన్నారు. ఉచిత కంటి శిబిరాన్ని ఇందల్వాయి ప్రభుత్వ ఆసుపత్రి ఆధ్వర్యంలో నిర్వహించినట్లు టోల్ ప్లాజాలో వీధులు నిర్వహించే సిబ్బంది అందరికీ కంటి పరీక్షలు నిర్వహించినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసపత్రి వైద్యులు సంతోష్ కుమార్, వరలక్ష్మి, నవత, ఎస్ఐ నరేష్, మండల ఆరోగ్య విస్తరణ అధికారి వై శంకర్, అధికారులు ప్రకాష్, లిఖిత, వెంకట్ రెడ్డి, ప్రసాద్ తో పాటు టోల్ ప్లాజా వైద్య సిబ్బంది, ఆశ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Spread the love