నవతెలంగాణ-శంకరపట్నం
శంకరపట్నం మండల కేంద్రంలో కేశవపట్నం పోలీస్ స్టేషన్ ముందు బుధవారం డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీ చేసిన ఎస్సై మామిడాల సురేందర్, మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వాహనదారులను మద్యం తాగి వాహనాలు నడిపితే జరిమానా తో పాటు జైలు శిక్ష కూడా పడుతుందని, వాహనదారులు తప్పనిసరిగా అన్ని కాగితాలు, హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని చిన్నపిల్లలకు ఎట్టి పరిస్థితుల్లో వాహనాలు ఇవ్వకూడదని వాహనదారులకు హెచ్చరించారు.ఈ తనికీలో ఏ ఎస్ ఐ మల్లారెడ్డి, కానిస్టేబుల్ రామచందర్, హోంగార్డ్ రవి, అశోక్ సిబ్బంది పాల్గొన్నారు.