– వాడి, గోజేగావ్, గ్రామాల ప్రజలకు తెగిన సంబంధాలు.
– వందలాది ఎకరాల్లో పంట నష్టం ఆదుకోవాలని లోతట్టు గ్రామాల ప్రజల ఆవేదన
– ఎమ్మెల్యే గారు వరద తాకిడి గ్రామాలను సందర్శించాలి పంట నష్టాన్ని పరిహారం ఇప్పించాలి లింబూర్ గ్రామ రైతుల విజ్ఞప్తి
నవతెలంగాణ- మద్నూర్
గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఎగువ మహారాష్ట్ర నుండి పారే లేండి వాగు పొంగిపొర్లుతుంది. వాగు పరివాహాక గ్రామాలైన గోజేగావ్ గ్రామానికి మద్నూర్ మండల కేంద్రానికి తెగిన సంబంధాలు గ్రామం చుట్టూ వరద నీరు చేరుతుందని ఇలాగే కొనసాగితే గ్రామంలోకి వరద నీరు వచ్చే అవకాశం ఉందని ఆ గ్రామ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే లింబూర్ మధ్య వాడి గ్రామం మధ్య గల వాగు గత రెండు మూడు రోజులుగా కురుస్తున్న వర్షానికి ఫుల్లుగా పారుతుంది. వాడి గ్రామ ప్రజలకు లింబూర్ గ్రామపంచాయతీ ప్రజలకు సంబంధాలు తెగిపోయాయి వాడి గ్రామంలో ఏమి జరుగుతుందో ఎవరికీ తెలియని పరిస్థితి అదే విధంగా లేండి వాగు పరివాహక గ్రామాలైన లింబూర్ గ్రామం చుట్టూ వరద నీరు చేరుతున్నాయి వందల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని లేండి వాగు పరివాహక గ్రామాలైన చిన్న టాక్లి పెద్ద టాక్లి సిర్పూర్ తదితర గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. లేండి వాగు పొంగిపొర్లడం వందలాది ఎకరాలు పంట మునిగి పూర్తిగా నష్టం వాటిల్లిందని లింబూరు గ్రామానికి చెందిన రైతులు ఆవేదన వ్యక్తపరుస్తూ అయ్యా ఎమ్మెల్యే గారు భారీ వర్షంతో వర్ధనీరు చేరి జరిగిన పంట నష్టాన్ని పరిశీలించి నష్టపరిహారం ఇప్పించాలని డిమాండ్ చేస్తున్నారు. లేండి వాగు మద్నూర్ మండల కేంద్రానికి గోజేగావ్ గ్రామానికి మధ్య ఉంది వర్షాకాలంలో లేండి వాగు పొంగిపొర్లుతే ఆ గ్రామంతో సంబంధాలు పూర్తిగా నిలిచిపోతాయి ప్రస్తుతం నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. మద్నూర్ డోంగ్లి మండలాల పరిధిలోని పలు గ్రామాలకు వరద నీరు చేరుతుంది. పంట నష్టం వందలాది వేలాది ఎకరాలు జరిగే అవకాశం ఉన్నట్లు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు ఇలాగే కొనసాగితే లోతట్టు గ్రామాల్లోకి నీరు చేరే అవకాశం ఉన్నట్లు లేండి వాగు ఇటు మంజీరా నది పరివాహక గ్రామాల ప్రజలు ఆందోళనలో కొనసాగుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎమ్మెల్యే ఎంపీ సంబంధిత శాఖల అధికారులు పర్యటించి సహాయక చర్యలు చేపట్టాలని లోతట్టు గ్రామాల ప్రజలు కోరుతున్నారు భారీ వర్షాలతో ప్రజలు అతలాకుతలం అవుతున్నారు వందలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయి పంట నష్టంతో పాటు రోడ్లు భారీగా నష్టపోయాయి ప్రభుత్వం వెంటనే స్పందించాలని పలు గ్రామాల ప్రజలు కోరుకుంటున్నారు.