ముందస్తు అరెస్టులు అమానుషం

నవతెలంగాణ – నవీపేట్: ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్మల్ పర్యటన సందర్భంగా సిపిఎం, బిజెపి, బిజెవైఎం నాయకులను ముందస్తు అరెస్టు చేయడం అమానుషమని అన్నారు. మండలంలో సిపిఎం మండల కార్యదర్శి నాయక్ వాడి శ్రీనివాస్, బిజెపి జిల్లా నాయకులు పుట్ట శ్రీనివాస్ గౌడ్ మరియు బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులు పిల్లీ శ్రీకాంత్ ను పోలీసులు శనివారం ముందస్తు అరెస్టులు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం పర్యటన నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీ నాయకులను అరెస్టు చేయడం ఆప్రజాస్వామికమని అన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న వారిని అరెస్టులతో భయపెట్టలేరని అన్నారు.

Spread the love