తాడ్వాయి మండల నేతకాని సంఘం నూతన కమిటీ ఎన్నిక

నవతెలంగాణ- తాడ్వాయి
ములుగు జిల్లా తాడ్వాయి మండలానికి చెందిన నేతకాని మహర్ (ఎస్సి) కుల హక్కుల పరిరక్షణ సంఘం నూతన కమిటీని ఆదివారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో గౌరవ జాతీయ అధ్యక్షులు గోమాస శ్రీనివాస్, రాష్ట్ర అధ్యక్షులు ఎస్కుర్ రాజమల్లు వారి ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షులు జాడీ రాంబాబు, రాష్ట్ర అధ్యక్షులు దిగుగొండ కాంతారావు ల ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన మండల అధ్యక్షులుగా జాడి సంజీవ, వర్కింగ్ ప్రెసిడెంట్ చెన్నూరు వెంకన్న, ఉపాధ్యక్షులుగా జనగాం సమ్మయ్య, ప్రధాన కార్యదర్శిగా చల్లారి సత్యం, సంయుక్త కార్యదర్శి గాందెర్ల కన్నయ్య, సహాయ కార్యదర్శిగా చెన్నూరు సతీష్, ప్రచార కార్యదర్శిగా గాంధార లక్ష్మణ్, కోశాధికారిగా ఆకుదారి గంగరాజు, అధికార ప్రతి బానిస రాంబాబు, యూత్ అధ్యక్షులుగా జాడి సాంబయ్య, భీమ్ సైనిక్ దళ్ అధ్యక్షులుగా దుర్గం నవీన్, మిగతా కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతనంగా ఎన్నికైన తెలంగాణ నేతకాని మెహర్ కుల హక్కుల పరిరక్షణ సంఘం తాడ్వాయి మండల అధ్యక్షులు జాడి సంజీవ మాట్లాడుతూ సామజికముగా, ఆర్ధికముగా వెనుకబడిన నేతకాని జాతి అభివృద్ధి కొరకు, సమస్యల పరిష్కారం కొరకు నేతకానీలంత ఐక్యతగా ఉండాలని, సంఘంలో ఉన్న నాయకులంతా పార్టీలకతీతముగా పనిచేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు భీమ్ సైనిక దళ్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ జాడి వెంకట్, అధికార ప్రతినిధి దుర్గం రాజు, జిల్లా ఉపాధ్యక్షులు పూసల నరసింహారావు, ఉపాధ్యక్షులు సల్లూర్ లక్ష్మణ్, జిల్లా కోశాధికారి గాందెర్ల కాంతారావు, జిల్లా నాయకులు పోశయ్య, బాబు, సుధాకర్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love