ఆమెను ఉన్నతంగా తీర్చిదిద్దుతూ…

గొప్ప విజయాలు చిన్నగా మొదలవుతాయి. అందరూ పోయే దారి వెంటపోవడంలో ప్రత్యేకం ఏదీ వుండదు. దారి చేసుకుని పోతేనే గుర్తింపు వుంటుంది. ఆ కనుక్కున్న దారి వెనుకవారికి మార్గదర్శకం అవుతుంది. ఇలాంటి కొటేషన్లు కేవలం చదివి ఊరుకోవడం కాదు. వాటిని నిజం చేసే శక్తి, కార్యదీక్షత, పట్టుదల, క్రమశిక్షణ కొందరు మహిళల్లో ఎక్కువ వుంటుంది. కానీ ఈ పురుషాధిక్య సమాజంలో నైపుణ్యం వున్నప్పటికీ ఎంత మంది మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో ఉన్నత స్థాయికి చేరుకోగలుగుతున్నారు? ఆకాశంలో సగ భాగం ఆడవారే అనే మాట వినడానికి చాలా బావుంటుంది. కానీ.. నిజంగా సగ భాగం వున్నారా? కనీసం పావు భాగమైనా వున్నారా? ఈ ప్రశ్నలకి సమాధానాలు తెలుసుకోవాలంటే నిుష్ట్రవ ూ్‌aతీ ఱఅ వీవు గురించి తెలుసుకోవాలి. దాని గురించి తెలుసుకోవాలంటే ఉమ కాసోజి గురించి తెలుసుకోవాలి. వెలుగు చూపే కాంతిపుంజం తమలోనే వుందని, ఆ కాంతిని.. తమ స్వయం శక్తితో బయటకి వెలికితీయాలనీ ఒక స్టార్టప్‌ నెలకొల్పిన ఆమె పరిచయం నేటి మానవిలో…
నిరంజన్‌ కాసోజి, హేమలతకు ముగ్గురు సంతానం. ఉమ, శ్రీధర్‌, ఉష. తండ్రి ఇంజనీర్‌, బిల్డర్‌. హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగిన ఉమ పదవ తరగతి వరకు ఆబిడ్స్‌లోని రోజ్రీ కాన్వెంట్‌ హైస్కూల్ల్‌, ఇంటర్‌ మెహదీ పట్నంలోని సెయింట్‌ ఆన్స్‌ కాలేజీలో పూర్తి చేశారు. తర్వాత మెడిసెన్‌ పట్ల ఆకర్షితులయ్యారు. అయితే పూనే, మణిపాల్‌ కాలేజీలో సీట్‌ వచ్చింది. అక్కడి వరకు వెళ్ళడం ఇష్టం లేక నాంపల్లిలోని వనితా కాలేజ్‌లో బి.కాం చేశారు. తర్వాత ఎంబీఏ ప్రతిష్టాత్మకమైన ఐఐఎం యూనివర్సిటీలో చేరాలని గట్టి నిర్ణయం తీసుకున్నారు. పట్టుదలతో చదివి సీటు సంపాదించారు. విజయవంతంగా ఎంబీఏ పూర్తి చేశారు. అక్కడ పరిచయమైన తన బ్యాచ్‌ మేట్‌ రవి అప్పయ్యను వివాహం చేసుకున్నారు. రవి ప్రస్తుతం ఇన్ఫోసిస్‌లో జాబ్‌ చేస్తున్నారు.
అంతటితో ఆగిపోలేదు
ఎంబీఏ తర్వాత 2001లో హైదరాబాద్‌లోని ఓ సంస్థలో చేరారు. అక్కడ 2004 వరకూ చేసి ఇన్ఫోసిస్‌లో చేరారు. 2005లో వీరికి అఖిల్‌ జన్మించాడు. ఇద్దరూ ఉద్యోగస్తులే కావడంతో బిడ్డ ఆలనాపాలనా చూసుకోడానికి ఉమ తన తల్లి సహాయం తీసుకున్నారు. 2006లో మరో కంపెనీకి మారారు. ఇలా వివిధ కంపెనీల్లో అనేక బాధ్యతలు నిర్వహించారు. ఉమ ఎక్కడ పని చేసినా తనకి అప్పగించిన బాధ్యతను ఎంతో ఇష్టంగా చేసేవారు. అయితే ఇలా ఉద్యోగం చేసుకుంటూ అక్కడే ఆమె ఆగిపోవాలనుకోలేదు. తనకు ఎదురైన ఓ అనుభవంతో కార్పొరేట్‌ రంగంలో మహిళలు ఎదుర్కొంటున్న ఓ సమస్యకు పరిష్కారం వెదకాలనుకున్నారు. ఈ ఆలోచనను తన స్నేహితురాలైన మాహువా ముఖర్జీతో పంచుకున్నారు. వీరిద్దరి పయనమే The Star in Me””గా రూపుదిద్దుకుంది.
అనేక సందేహాలు…
కొత్త స్టార్టప్‌లపై సహజంగా ఉండే అనుమానాలు, సందేహాలు ఉమ కుటుంబంలో, మిత్ర బృందంలో కూడా వచ్చాయి. చేసే మంచి ఉద్యోగం మానేసి భవిష్యత్తులో ఎలా సాగుతుందో తెలియని స్టార్టప్‌ ప్రారంభించట మేమిటనే ప్రశ్నలు మొదలయ్యాయి. కానీ భర్త రవి ఇచ్చిన ప్రోత్సాహంతో అడుగు ముందుకు వేసింది. దీనికి తోడు ఉమ పట్టుదల, చేపట్టిన కార్యం సాధించి తీరగలను అనే మొండి ధైర్యం ఆమెకు తోడయ్యాయి. ఈ స్టార్టప్‌కి పెట్టుబడి స్నేహితులిద్దరూ పదిహేనేండ్లుగా పొదుపు చేసుకున్న డబ్బును ఉపయోగించుకున్నారు. అయితే కుటుంబ సభ్యులు, స్నేహితులు కొందరు ఆర్థిక సహాయం చేస్తామని ముందుకు వచ్చినా కాదని నిరాకరించారు. భర్తల నుంచి కూడా ఆర్థిక సహాయం ఆశించకుండా తమ స్టార్టప్‌ను ప్రారంభించారు.
ది స్టార్‌ ఇన్‌ మి
ఓటమి భయంలో వుంటుంది. గెలుపు ప్రయత్నంలో వుంటుంది. ఆ ప్రయత్నం నమ్మకంలో వుంటుంది. దృఢ విశ్వాసమే గెలుపుకి మూలం. ఆ నమ్మకంతో 2018లో చేసిన ప్రయత్నమే ‘ది స్టార్‌ ఇన్‌ మి’. ఉద్యోగాల వెతుకులాటలో, నేటి అవసరాలకి అనుగుణంగా మహిళలకి సరైన దిశానిర్దేశం చేయడమే ఈ సంస్థ లక్ష్యం. మొదట్లో మహిళల కోసం ఒక ఫ్లాట్‌ ఫామ్‌ వలే ఏర్పాటు చేసిన దీనిలో మన దేశం నుండి మాత్రమే కాకుండా బయట దేశాల నుంచి కూడా మహిళలు వచ్చి చేరేవారు. ప్రస్తుతం చాలా కంపెనీల్లో మహిళా ఉద్యోగులకి మేనేజ్మెంట్‌ స్కిల్స్‌లో ట్రైనింగ్‌ ఇస్తున్నారు. ఇన్ఫోసిస్‌, కాగ్నిజెంట్‌ వంటి మల్టీ నేషనల్‌ కంపెనీలుThe Star in Me కలిసి అవసరమైన సేవలు పొందుతున్నారు. క్లయంట్స్‌ కూడా పెరిగారు
కార్యదీక్షే కారణం
మొదలుపెట్టిన రెండేండ్లకే యుఎస్‌లోని ఒక పెద్ద కంపెనీ నుండి ఫండ్స్‌ రైజ్‌ చేసుకోగలిగారు. ఇండియాలోని ప్రతిష్టాత్మకమైన  కూడా ఈ సంస్థలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చింది. 15 దేశాల నుంచి 90 మందిని బెస్ట్‌ లీడర్‌షిప్‌ నిపుణులని ఈ సంస్థకు అనుసంధానం చేసుకుని వారి ద్వారా క్లయంట్లకి తర్ఫీదు ఇచ్చి, ఉద్యోగాల్లో ఉన్నత స్థాయికి చేరేందుకు దోహదపడుతున్నారు ఉమ. తమ సంస్థలో 15 మంది ఉద్యోగులు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వర్క్‌ చేస్తున్నారు. సంస్థని నెలకొల్పిన అతి తక్కువ సమయంలోనే దేశంలో మొదటి పది స్థానాల్లో వున్న స్టార్టప్‌ కంపెనీలలో ఒకటిగా నిలబడింది వీరి సంస్థ. దీనికి కారణం ఉమ కాసోజి కార్యదీక్షత అనే చెప్పాలి. స్నేహితురాలు, పార్టనర్‌ మహువా తోడుతో ఎలాంటి సమస్యనైనా ఇట్టే పరిష్కరించుకుంటున్నారు. విధి నిర్వహణలో లోటుపాట్లు ఎదురైతే ఒకరికి ఒకరు ప్రోత్సహించుకుంటూ కలిసి ముందుకు సాగుతూ తమ సంస్థని ముందుకు నడిపిస్తున్నారు.
– కలవల గిరిజారాణి

ఆ అనుభవం ఏంటి..?
ఒకసారి తాను చేసే ఉద్యోగ బాధ్యతల్లో భాగంగా ఉమ, మాహువా కలిసి బెంగళూరులోని ఒక నాయకత్వ సదస్సుకి హాజరయారు. అక్కడ వీరు గమనించిన విషయం ఆ సదస్సుకి హాజరైన వారిలో మగవారు 70 మంది ఉంటే మహిళలు వీరిద్దరే. ఇది వారిలో ఓ రకమైన అలజడి కలిగించింది. కాలేజీలు, యూనివర్సిటీల నుండి ప్రతి ఏటా చాలా మందే అమ్మాయిలు కార్పొరేట్‌ ఉద్యోగాల్లో చేరుతున్నారు. కానీ పురుషులు మాత్రమే త్వర త్వరగా కెరీర్‌లో ఉన్నత స్థాయికి చేరుకోగలుగతున్నారు. మహిళలు వెనకపడే వుంటున్నారు. సీనియారిటీ, పని అనుభవం వున్నా కూడా మహిళా ఉద్యో గులు ఎందుకు ఉన్నత స్థాయికి చేరుకోలేకపోతున్నారు? అనే ఆమె ప్రశ్నకి సమాధానం ‘ది స్టార్‌ ఇన్‌ మి’ అనే సంస్థ అంకురించింది. చేస్తున్న మంచి ఉద్యోగాలకి రాజీనామాలు చేసి స్నేహితులిద్దరూ ఈ కొత్త స్టార్టప్‌ మొదలుపెట్టారు.

Spread the love