హైదరాబాద్‌లో టర్టెల్‌ వ్యాక్స్‌ కార్యకలాపాల విస్తరణ

హైదరాబాద్‌ : చికాగో కేంద్రంగా కార్‌ కేర్‌ సేవలనందిస్తున్న టర్టెల్‌ వ్యాక్స్‌ హైదరాబాద్‌లో తన కార్యకలాపాలు విస్తరించింది. జెనెక్స్‌, ఎక్సోడర్‌, ఇండియన్‌ డెకార్స్‌ సహకారంతో మాదాపూర్‌లో నూతన కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. బుధవారం దీన్ని టర్టెల్‌ వ్యాక్స్‌ గ్లోబల్‌ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ లారీ కింగ్‌, టర్టెల్‌ వ్యాక్స్‌ ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ సాజన్‌ మురళీ పురవంగర లాంచనంగా ప్రారంభించారు. నగరంలో తమకు ఇప్పటికే రెండు స్టూడియోలు ఉన్నాయని సాజన్‌ మురళీ తెలిపారు. అల్ట్రా మోడ్రన్‌ టర్టెల్‌ వ్యాక్స్‌ డిటైలింగ్‌ సాంకేతితలతో పాటుగా అత్యున్నత అర్హతలు, సుశిక్షితులైన సేవా సిబ్బందిని కలిగిన ఈ టర్టెల్‌ వ్యాక్స్‌ కార్‌ కేర్‌ స్టూడియోలు విస్తృత శ్రేణీ కార్‌ డిటైలింగ్‌ సేవలు, ఉత్పత్తులను కారు ప్రియుల అభిరుచులకు తగినట్లుగా అందిస్తామన్నారు. సమగ్రమైన ప్రీమియం ఇంటీరియర్‌ డిజైనింగ్‌లు చేస్తామన్నారు.