బదిలీపై వెళ్తున్న కమాండెంట్ సత్య శ్రీనివాస్ రావుకు  ఘనంగా వీడ్కోలు..

నవతెలంగాణ-డిచ్ పల్లి
తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక పోలీస్ 7వ బెటాలియన్ కమాండెంట్ యన్.వి సత్య శ్రీనివాస్ రావు 7వ బెటాలియన్ నుండి 12 వ బెటాలియన్ అన్నెపర్తి, నల్గొండ జిల్లా కు బదిలీ పైన వెళ్తున్న సందర్భంగా బుధవారం ఘనంగా వీడ్కోలు నిర్వహించారు. యస్.వి సత్య శ్రీనివాస్ రావు 7వ బెటాలియన్ కమాండెంట్గా 2020 లో బాధ్యతలు స్వీకరించారు. పోలీస్ సిబ్బంది వర్షాన్ని సైతం లెక్కచేయకుండా బెటాలియన్ లోని పలు రహదారుల వెంట కమాండెంట్ సత్య శ్రీనివాసరావుకు కనివిని ఎరుగని రీతిలో సన్మానించి ఒక వాహనంలో కుర్చుండ పేట్టుకుని రెండు వైపులా తాడుతో వాహనం ను అడుతూ లాగుతూ తమ ప్రేమబి మానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా బదిలీపై వెళ్తున్న కమాండెంట్ ఎన్వి సత్య శ్రీనివాసరావు మాట్లాడుతూ ఉద్యోగంలో బదిలీలు సహజమని, ఒక చోటు నుండి వేరే చోటుకు వెళ్లక తప్పదన్నారు.గత ముడేళ్ళుగా బెటాలియన్ అభివృద్ధికి, పోలిస్ సిబ్బంది యోగక్షేమాలకు ప్రత్యేక కృషి చేశారని ఆయన కోనియాడరు. అందరి ఆధారాభిమానాలు పోందడం జీవితంలో మరిచిపోలేని ఘట్టమన్నారు. అనంతరం కమాండెంట్ సత్య శ్రీనివాసరావు దంపతులకు పూలమాలలు సెలవులతో ఘనంగా పూల వర్షం కురిపించారు.ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్స్ యం. వేంకటేశ్వర్లు, సి. అంజనేయ రెడ్డి, కె. బాస్కర్ రావు, ఏఓ హంసరాణి, యూనిట్ హస్పిటల్ డాక్టర్ యన్. అనుపమా, అర్.ఐలు యం. రాజు, పి. వేంకటేశ్వర్లు, అర్. సర్దార్ నాయక్, బి. అనిల్ కుమార్, యల్. మహేష్, యం. నరేష్, అర్. ప్రహల్లాద్, కె. శ్యాంరావు, బి. వసంత్ రావు, సి. సురేష్, అర్.యస్.ఐలు, మినిస్ట్రేయల్ స్టాఫ్, మెడికల్ స్టాఫ్, సిబ్బంది పాల్గొన్నారు.