
మహిళలు ఇంట్లో తయారు చేసే వస్తువులతో స్టైల్ పిటరా ప్యాషన్ లైఫ్ స్టైల్ఎగ్జిబిషన్ను ప్రారంభించనున్నట్లు క్రియేటీవ్ ఆర్ట్స్ ప్రతినిధులు రమారాఠి, వైశాలి, నీనల్ సార్జా, వినితా బల్దివాలు తెలిపారు. మంగళవారం కోఠిలోని అస్మత్ గంజ్ ఏర్పాటు చేసిన సమావేశంలో ఎగ్జిబిషన్ పోస్టర్ ను వారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…. ఈ నెల 20, 21 తేదీల్లో రెండురోజుల పాటు స్టైల్ పిటరా ప్యాషన్ లైఫ్ స్టైల్ ఎగ్జిబిషన్ రామ్ కోఠి లోని కచ్చిభవన్ లో ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. గృహిణులు ఇంట్లో తయారు చేసే గృహోపకరణ పరికరాలు, దుస్తువులు, ఇంటీరియర్ వస్తువులు, జ్యువెలరీ, ఫుట్వేర్ తదితర వస్తువులతో ఈ ఎగ్జిబిషన్ 100 స్టాళ్లతో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ రాష్ట్రాల నుంచి మహిళలు తమ ఉత్పత్తులతో స్టాళ్లు ఏర్పాటు చేసుకోనున్నట్లు ఎగ్జిబిషన్ లో వచ్చిన ఆదాయంతో ఏకల్ విద్యాలయకు చారిటీగా ఇవ్వనున్నట్లు వారు తెలిపారు. తద్వార విద్యార్థుల విద్య కోసం దోహద పడుతుందన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అడిషనల్ డీజీ హోంగార్డ్స్ అభిలాష దిషిత్, ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ స్వేతలు హాజరై ఎగ్జిబిషన్ ను ప్రారంభిస్తారని తెలిపారు. ఈ ఎగ్జిబిషన్ ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు రెండురోజుల పాటు కొనసాగుతుందని తెలిపారు.