నిండుకున్న మల్లూరువాగు జలాశయం..

– 109 మీటర్లకు చేరిన వరద
– మరో 6 మీటర్లైతే మత్తడి
నవతెలంగాణ-మంగపేట :
మండలంలోని మల్లూరువాగు(నర్సింహాసాగర్ ప్రాజెక్టు)మధ్య తరహా ప్రాజెక్టు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు 109.10 మీటర్ల వరదనీరు చేరి నిండుకుండను తలపిస్తోంది. 115.250 మీటర్ల సామర్థ్యంతో నిర్మించిన మల్లూరువాగు ప్రాజెక్టు గడచిన మూడు సంవత్సరాలుగా పడుతున్న వర్షాలకు పూర్తిగా నిండి మత్తడిపోస్తుండడంతో ఆయకట్టు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గురువారం నాటికి వరదనీరు 109.10 మీటర్లు చేరగా మరో 6 మీటర్ల వరదనీరు ప్రాజెక్టులోకి చేరితే మత్తడి పడే అవకాశాలున్నాయి. కుడి ఎడమ కాలువల కింద సుమారు 20 వేల ఎకరాల్లో రైతాంగం రెండు పంటలు పండించుకునేందుకు ప్రస్తు వరద స్టోరేజి సరిపోతుదని రైతులు తెలిపారు. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులోకి 140 క్యూసెక్కుల వరద నీరు చేరిందని కుడి ఎడమ కాలువల్లో ఎలాంటి లీకేజీలు లేవని నీటిపారుదల శాఖ ఏఈ వలీం మహ్మద్ తెలిపారు. మూడు రోజుల వర్షపాతం 62.4 మిల్లీమీటర్లుగా నమోదైనట్లు ఆయన పేర్కొన్నారు.

Spread the love