మృతుల కుటుంబాలకు ఐక్యత ఆర్థికసాయం

నవతెలంగాణ-ఆమనగల్‌
మండలంలోని రాంనుంతల గ్రామానికి చెందిన డి.మల్లయ్య అనారోగ్యంతో బాధపడుతూమృతిచెందాడు. బుధవారం విషయం తెలుసుకున్న ఐక్యత ఫౌండేషన్‌ చైర్మెన్‌, సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకులు సుంకిరెడ్డి రాఘవేందర్‌ రెడ్డి బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ తన ఫౌండేషన్‌ ద్వారా మృతుని కుటుంబ సభ్యులకు స్థానిక నాయకుల చేతులమీదుగా రూ.5 వేలు ఆర్థికసాయం అందజేశారు. అదేవిధంగా కడ్తాల్‌ మండలంలోని ఎక్వాయిపల్లి గ్రామానికి చెందిన జె.రాములయ్య అనారోగ్యంతో బాధపడుతూ మతిచెందిన విషయం తెలుసుకున్న సుంకిరెడ్డి రాఘవేందర్‌ రెడ్డి బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ తన ఫౌండేషన్‌ ద్వారా మతుని కుటుంబ సభ్యులకు రూ.5 వేలు ఆర్థికసాయం అందజేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు, ఐక్యత ఫౌండేషన్‌ సభ్యులు పి.కరుణాకర్‌ గౌడ్‌, వెంకటేష్‌, చోటే, ఇందిరమ్మ, రమేష్‌ నాయక్‌, బాలరాజు, మల్లయ్య, శ్రీశైలం, శ్రీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు. రాంనుంతల గ్రామంలో మాజీ సర్పంచ్‌ రచ్చ శ్రీరాములు, మాజీ ఎంపీటీసీ సభ్యులు పి.వల్లి పంతు నాయక్‌, మేడిగడ్డ ఉపసర్పంచ్‌ మల్లేష్‌ నాయక్‌, నాయకులు రవి, నారయ్య, కష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.