రోడ్డు బాగు చేయించండి వీధిలైట్లు వెలిగేటట్టు చూడండి

నవతెలంగాణ- మద్నూర్

మద్నూర్ మండల కేంద్ర మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో గతంలో మండల కేంద్రం నుండి జాతీయ రహదారి ఉండగా 161 వ జాతీయ రహదారిని గుర్తిస్తూ దానిని నాలుగు లైన్ల రహదారిగా నిర్మాణం చేపట్టగా ఈ రహదారి మండల కేంద్రానికి బైపాస్ గుండా వెళ్లడం జరిగింది. మండల కేంద్రానికి గల రహదారి ఇరువైపులా చెడిపోయి భారీ గుంతలు పడ్డాయి. జాతీయ రహదారి బాగుపడింది మండల కేంద్రానికి వచ్చే రహదారి చెడిపోయింది. ఈ రహదారి గుండా నడిచే వాహనదారులు గుంతల్లో పడి గాయాల పాలవుతున్నారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని గ్రామపంచాయతీ సర్పంచ్ పాలకవర్గం గ్రామపంచాయతీ అధికారులు వెంటనే రోడ్డు బాగు చేయించాలని అలాగే రహదారి గుండా గల వీధిలైట్లు వెలిగేటట్లు చూడాలని మండల కేంద్ర యువకులు సోమవారం నాడు గ్రామపంచాయతీకి తరలివచ్చి గ్రామ సర్పంచ్ సురేష్ కు గ్రామ కార్యదర్శి సందీప్ కుమార్ కు ఒక వినతి పత్రాన్ని అందజేశారు. యువకులు అందజేసిన వినతి పత్రానికి గ్రామ సర్పంచ్ గ్రామ కార్యదర్శి రోడ్డు బాగు కోసం అలాగే వీధిలైట్ల వెలిగే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు. ఈ వినోద్ పత్రం అందజేత కార్యక్రమంలో సాయిలు, బాలాజీ, సాయి, జలీల్, తదితరులు పాల్గొన్నారు.
Spread the love