జులై 1న ఉచిత ఈఎన్ టి వైద్య శిబిరం..

నవతెలంగాణ -సుల్తాన్ బజార్
జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకుని జులై 1వ తేదీన అసోసియేషన్ ఆఫ్ ఓటో లోజిస్ట్స్ (ఏవోఐ) హైదరాబాద్ బ్రాంచ్, ఇండియన్ మెడికల్ అసోసియే షన్ హైదరాబాద్ నార్త్ బ్రాంచ్ ల సంయుక్త ఆధ్వర్యంలో బేగంపేట్ మయూర్ మార్గ్ లోని దేవనార్ అంధ పాఠశాలలో ఉచిత ఈఎన్ టి (చెవి గొంతు ముక్కు) ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నామని ఈఎన్ టి ఆసుపత్రి ప్రొఫెసర్ డాక్టర్ సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఈ వైద్య శిబినంలో ఉచితంగా ఈఎన్ టి సంబంధిత పరీక్షలతో పాటు చికిత్సలు నిర్వహించి, మందులను ఉచితంగా పంపిణీ చేస్తామన్నారు. శస్త్ర చికి త్సలు అవసరమైన వారికి ఈఎన్ టి ఆసుపత్రికి రిఫర్ చేస్తామన్నారు.

Spread the love