ఆర్మూర్ డివిజన్లో ఉచిత వైద్య శిబిరాలు

నవతెలంగాణ ఆర్మూర్
ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్రం ఆదేశానుసారం 25వ తేదీ ఆదివారం డివిజన్ లోని వివిధ గ్రామాలలో ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని ఐఎంఏ అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ ప్రకాష్, డాక్టర్ భాను రామగిరి, డాక్టర్ రాకేష్ లు శనివారం తెలిపారు. డివిజన్లోని ఆలూర్ మండల కేంద్రంలోనూ అంకాపూర్, పిప్రీ, ,వేల్పూర్ మండలంలోని అక్లూరూ, పడగల్, భీమ్గల్ మండలంలోని బడా భీంగల్ లలో ప్రముఖ ఆసుపత్రిలకు సంబంధించిన వైద్యులు ఉచితంగా వైద్య సేవలు అందజేస్తారని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.