గోపులారం నుంచి దొంతంపల్లి వరకూ నక్షబాట వదిలి రెండు గేట్లు ఓపెన్‌ పెట్టాలి

తహసీల్దార్‌ నైముద్దీన్‌కు వినతి : గ్రామస్తులు
నవతెలంగాణ-శంకర్‌పల్లి
గోపులారం నుంచి దొంతంపల్లి వరకు నక్షబాట వదులుతూ రెండు గేట్లు ఓపెన్‌ పెట్టాలని మిస్సిడ్‌ వీడియోస్‌ కంపెనీ యాజమాన్యాన్ని గ్రామస్తులు కోరారు. శుక్రవారం మిస్సిడ్‌ వీడియోస్‌ కంపెనీ వద్ద నుంచి నక్షబాట ఇప్పించాలని కోరుతూ గ్రామస్తులు ఉపసర్పంచ్‌ కుంటి భీమేష్‌ యాదవ్‌, మాజీ ఎంపీటీసీ గడుసు భిక్షపతి, మాజీ సర్పంచ్‌, తొండ యాదయ్య, చంద్రయ్య, విష్ణువర్ధన్‌, కుంటి కుమార్‌, మల్లేష్‌ అక్షయగౌడ్‌, భాస్కర్‌, ప్రవీణ్‌ కలసి తహసీల్దార్‌ నైముద్దీన్‌కు వినతిపత్రం అందజేశారు. . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గవర్నమెంట్‌ ఆదేశాలు బేకదారు చేస్తూ, వారు దారి మూసి, మరోపక్క నుంచి వాడుకోవడం జరుగుతుందన్నారు.ఈ విషయంపై తహసీల్దార్‌్‌ పరిశీలించి, ఆ స్థలంలో బోర్డు పెట్టడం జరిగిందన్నారు. అయితే గోపులారం అభివృద్ధి మార్గంలో నడవడానికి వీలుగా ఉంటుందని భావించి సామరస్యంగా పరిష్కరించుకోవాలని మేస్సిడిక్‌ వీడియోస్‌ వారికి విజ్ఞప్తి చేసినట్టు వెల్లడించారు.కానీ వారి నుంచి ఏలాంటి స్పందన లేకపోవడంతో మళ్లీ తహసీల్దార్‌కు ఫిర్యాదు చేయడంతో రెవెన్యూ స్థలాన్ని వారు స్వాధీనం చేసుకుని బోడు పెట్టినట్టు తెలిపారు. మరొసారి మర్యాద పూర్వకంగా మెసిడిక్‌ విడోస్‌ కంపెనీ వారిని విన్నవించుకోవడం 2500 కుటుంబాలు ఉన్నటువంటి గోపులారం గ్రామపంచాయతీకి పదిమంది (మెసిడిక్‌ విడోస్‌ ) వారు గోపులారం గ్రామపంచాయతీకి దారికి ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఇప్పటికైనా వెస్టిడికో విడోస్‌ కంపెనీ తరఫున గ్రామ పెద్దలతో, గ్రామపంచాయతీ పాలకవర్గాలతో చర్చించి నక్షబాట రెండు గేట్లు ఓపెన్‌ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.

Spread the love