నవీపేట్ లో బిక్షాటన చేస్తూ జిపి సిబ్బంది నిరసన

నవతెలంగాణ- నవీపేట్: పంచాయతీ సిబ్బంది 14వ రోజు సమ్మె సందర్భంగా భిక్షాటన చేస్తూ బుధవారం నిరసన వ్యక్తం చేశారు. సమ్మె శిబిరంతో పాటు మండల కేంద్రంలో బిక్షాటన చేశారు. చట్టబద్ధంగా సమ్మె చేస్తున్న కార్మికులను పోలీసు బలగాలతో అక్రమ అరెస్టులు చేసి పోటీ, ఉపాధి కార్మికులతో సమ్మెను నీరుగార్చే ప్రయత్నం చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ఇప్పటికైనా అధికారులు, పంచాయతీ పాలకవర్గాలు స్పందించి అన్ని పంచాయితీల ద్వారా తీర్మానాలు చేయించి సిబ్బంది న్యాయమైన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించే విధంగా కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) జిల్లా ఉపాధ్యక్షులు మేకల ఆంజనేయులు, మీన్ కుమార్, గంగామణి, పోశెట్టి, లక్ష్మణ్, కార్మికులు, కారోబార్లు పాల్గొన్నారు.
Spread the love