జోరు వానలో కొనసాగుతున్న గ్రామపంచాయతీ కార్మికుల సమ్మె…

నవతెలంగాణ -చివ్వేంల: మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ఎదుట గురువారం జోరు వానను సైతం లెక్కచేయకుండా 15వ రోజు పంచాయతీ కార్మికులు సమ్మె కొనసాగించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. గ్రామాలలో పంచాయతీ కార్మికులు పనిచేయకపోతే ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోయిందని,  ప్రజలు అనారోగ్యాల బారినపడే అవకాశం ఉన్నందున ప్రభుత్వం గ్రామపంచాయతీ కార్మికులతో  చర్చలు జరిపి న్యాయమైన తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ సిబ్బంది సాగర్, భిక్షం, కృష్ణ, మురళి, శంకర్, రవి, రాణి, రాంబాబు, నాగ, శ్రీను, రాంబాబు, నాగరాజు, ఉప్పలయ్య, పూలమ్మ, మోహన్, సురేష్, వెంకులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love