
మండలంలోని పలు గ్రామాలలో భూగర్భ జలాలు పెరగకపోవడంతో సన్నగా పోస్తున్న బోరు మోటర్లు వర్ష కాలం మొదలై దాదాపు జులై నెల కూడా కావస్తున్నా ఇప్పటి వరకు కురిషి న వర్షాలకు భోరు బావులలో ఇప్పటికి భూగర్భ జలాలు పెరగకపోవడంతో రైతులు దిగులు చెందుతున్నారు. గత మూడు రోజుల నుండి కురుస్తున్న వర్షంతో రైతులు పంట పొలాన్ని ట్రాక్టర్లతో దుక్కి దున్ని నాటు వేయడానికి సిద్ధం అవుతున్న సమయంలో బోరు బావులు చాలి చలాని నీళ్లు పోస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శివపూర్, చావని తండా, తలాబ్ తండా, గ్రామ శివారులో రైతులు నాటు వేయడానికి వెనుక ముందు ఆలోచనలో పడ్డారు. ప్రభుత్వం రైతులకు 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్న బోర్లు నీళ్లు పోయాక పోవడంతో రోజుకు ఒకటి, రెండు మాడులు ట్రాక్టర్ లతో సిద్ధం చేసుకుంటున్న పరిస్థితి ఏర్పడిందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇంకా వారం రోజుల వరకు భారీ వర్షాలు కురిస్తే గాని బోరు బావిలో భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉందని రైతులు అంటున్నారు.