కార్పోరేట్ల కోసమే మణిపూర్‌లో మానవ హననం : గడ్డం సదానందం

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
కార్పొరేటలకోసమే మణిపూర్‌లో మానవ హననం జరుగుతున్నదని సీపీఐ (ఎంఎల్‌) ఆర్‌ ఐ,సీఓసీ సభ్యులు గడ్డం సదానందం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అటవీ సంపదనంతా కార్పొరేట్లకు కట్టబెట్టేందుకు కుకీలను అడవి దూరం చేసే కుట్రలో భాగమే ఈ దారుణాలని తెలిపారు. అనేక మంది మహిళలపై సామూహిక లైంగిక దాడులు జరుగుతున్నా..కేంద్ర రాష్ట్ర ప్రభు త్వాలు స్పందించటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గుత్త పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసమే మోడీ విధానాలున్నాయని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాలను వెంటనే ఆపాలని డిమాండ్‌ చేశారు.

Spread the love